Etela Rajender On Coronavirus: ప్రకృతి కన్నెర్ర చేస్తే మనిషి తట్టుకోలేడు

Etela Rajender On Coronavirus: ప్రకృతి కన్నెర్ర చేస్తే మనిషి తట్టుకోలేడు
x
Highlights

Etela Rajender On Coronavirus: ప్రకృతి కన్నెర్ర చేస్తే మనిషి తట్టుకోలేడన్న విషయం మరోసారి నిరూపితమైందని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 'కరోనా...

Etela Rajender On Coronavirus: ప్రకృతి కన్నెర్ర చేస్తే మనిషి తట్టుకోలేడన్న విషయం మరోసారి నిరూపితమైందని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 'కరోనా వల్ల మనవ సంబంధాలలో గొప్ప మార్పు వచ్చ్హింది. ఈ మార్పు మనిషి బాధ్యతను గుర్తు చేసేలా ఉండాలి'. అని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజల సహకారం ఉండాలని కోరారు. కరోనా మరి కొన్ని రోజుల్లోగా తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,924 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,23,090కి చేరింది. మృతుల సంఖ్య 818కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 1,638 కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 90,988కి చేరింది.ప్రస్తుతం 31,284 మంది చికిత్స వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.68 ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోలుకున్న వారి రేటు 75.2కు చేరుకుంది. జీహెచ్ఎంసీలో - 461, రంగారెడ్డి- 213, మేడ్చెల్- 153, కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణాలో 13,27,791 కరోనా పరీక్షలు చేయడం జరిగింది.


Show Full Article
Print Article
Next Story
More Stories