DH Srinivas Rao: అంతా ఆ తాయత్తు మహిమే..!

Telangana Health Director DH Srinivas Rao Again Makes Controversial Comments At Iftar Party In Kothagudem
x

DH Srinivas Rao: చిన్నప్పుడు తనకు తాయత్తు కట్టడం వల్లే.. ఇప్పుడు ప్రాణాలతో ఉన్నానన్న డీహెచ్ శ్రీనివాసరావు

Highlights

DH Srinivas Rao: తనను కాపాడింది డాక్టర్లు కాదు.. తాయత్తేనన్న డీహెచ్

DH Srinivas Rao: తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాయత్తు మహిమతోనే ఈ స్థాయిలో ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. డాక్టర్లు చేయలేని పని తాయత్తు చేసిందని డీహెచ్‌ శ్రీనివాస్‌ అన్నారు. కొత్తగూడెం ఇఫ్తార్‌ విందులో తాయత్తు గురించి ప్రస్తావించారు.

చిన్నప్పుడు తనకు తాయత్తు కట్టడం వల్లే.. ఇప్పుడు ప్రాణాలతో ఉన్నానని కామెంట్స్ చేశారు డీహెచ్ శ్రీనివాసరావు. తనను కాపాడింది డాక్టర్లు కాదని.. తావీదులే కాపాడాయన్నారు. తాను పుట్టినప్పుడు తీవ్రరక్తస్రావమైందని ఆస్సత్రికి తీసుకువెళ్లినా బ్లీడింగ్ ఆగలేదన్నారు. దీంతో మౌల్వీ వద్ద తాయత్తు కట్టించారని వెంటనే బ్లీడింగ్ ఆగిపోయిందన్నారు. వైద్య సేవలు కాదు తాయత్తు మహిమ వల్లే తాను బతికానన్నారు. తావీదు మహిమ ఎంతో శక్తి వంతంగా ఉంటుందని, తాను ప్రత్యక్షంగా తావీదు మహిమను అనుభవించానన్నారు. ఇక గతంలోనూ కరోనా విషయంలోనూ ఇదే తరహా వక్యాఖ్యలు చేశారాయన..

కాగా, హెల్త్ డైరెక్టర్ కాంట్రవర్సీలో ఇరుక్కోవడం ఇదేం తొలిసారి కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాకు పితృ సామానులని ఆయన పాద పద్మాలు తాకడం నా అదృష్టంగా భావిస్తున్నానంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత ఏడాది.. కొత్తగూడెం శ్రీనగర్‌ కాలనీ డీఎస్‌ఆర్‌ క్యాంపు కార్యాలయంలో సినిమా పాటకు డ్యాన్స్‌ చేశారు. డీజే టిల్లు పాటకు బతుకమ్మ ముందు స్టెప్పులేశారు. దీనిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రంగా భావించే బతుకమ్మ సంబరాల్లో సినిమా పాటలకు స్టెప్పు లేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇంతకముందు ఓ తండాలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొనడంతో శ్రీనివాసరావు క్షుద్ర పూజలు నిర్వహించినట్టు ప్రచారం జరిగింది. ఇలా అనేక రకాలుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు డీహెచ్.

Show Full Article
Print Article
Next Story
More Stories