Telangana HC dismisses PIL : సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

Telangana HC dismisses PIL : సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
x
Highlights

Telangana HC dismisses PIL : తెలంగాణ ప్రభుత్వంకు హైకోర్టు లో ఊరట లభించింది. సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది....

Telangana HC dismisses PIL : తెలంగాణ ప్రభుత్వంకు హైకోర్టు లో ఊరట లభించింది. సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భ‌వ‌నాల‌ కూల్చివేత‌కు ప‌ర్యావ‌ర‌ణ శాఖ అనుమ‌తి అవ‌స‌రం లేద‌ని కోర్టు తేల్చిచెప్పింది. రాష్ర్ట మంత్రి వ‌ర్గ నిర్ణ‌యాన్ని హైకోర్టు స‌మ‌ర్థించింది. కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ భ‌వ‌నాల కూల్చివేత ప‌నులు కొన‌సాగించాల‌ని ప్ర‌భుత్వానికి కోర్టు సూచించింది. కూల్చివేతలపై దాఖలైన పిటిషన్‌లన్నీ న్యాయస్థానం కొట్టివేసింది. ఇప్పటికే 80 శాతం భవనాలను కూల్చివేశారు. ఇక కూల్చివేతలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆ పనులను మరింత వేగంగా పుంజుకోనున్నాయి.

భవనాల కూల్చివేతకు కేంద్రం అనుమతులు అవసరం లేదని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ అన్నారు. నూతన నిర్మాణాలు చేపట్టడానికే మా అనుమతులు కావాలని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. ల్యాండ్ ప్రిపరేషన్‌లోనే భవనాల కూల్చివేత వస్తుందని వాదించారు పిటిషనర్ తరపు న్యాయవాది. ఇరు వాదనలు విన్న హైకోర్టు.. కేంద్ర పర్యావరణ అనుమతి అవసరం లేదని సోలిసిటర్ జనరల్ వాదనను ఏకీభవించింది. ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకుని కూల్చివేత పనులను చేపడుతుందని పేర్కొంది హైకోర్టు.



Show Full Article
Print Article
Next Story
More Stories