బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు..

Telangana HC Declares BRS MLC Dande Vithal Election Invalid
x

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు

Highlights

Vithal Dande: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

Vithal Dande: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అతడి ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. ఆయనకు రూ.50 వేల జరిమానా విధించింది.

ఆదిలాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా 2022లో దండె విఠల్‌ ఎన్నికయ్యారు. అయితే, తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని, తన సంతకాలు ఫోర్జరీ చేశారని పాతిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించారు. విఠల్‌ ఎన్నిక చెల్లదంటూ ప్రకటించాలని కోర్టును కోరారు. ఫోర్జరీని తేల్చేందుకు పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్‌ లేబొరేటరికీ పంపించాలని కోరారు. అనంతరం దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. విఠల్‌ ఎన్నికను రద్దు చేస్తూ నేడు తీర్పు వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories