Group 1 Mains: గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనతో గాంధీ భవన్ వద్ద హై టెన్షన్ వాతావరణం

Group 1 Mains: గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనతో గాంధీ భవన్ వద్ద హై టెన్షన్ వాతావరణం
x
Highlights

Group 1 mains exams: తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలతో అశోక్ నగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా...

Group 1 mains exams: తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలతో అశోక్ నగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయడం, జీవో 29 రద్దు వంటి డిమాండ్లతో శుక్రవారం అభ్యర్థులు అశోక్ నగర్‌లో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలో పాల్గొన్న అభ్యర్థులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన సంగతి తెలిసిందే.

ఆదివారం కూడా ఉదయం నుండే భారీ సంఖ్యలో గ్రూప్ 1 అభ్యర్థులు అశోక్ నగర్ చేరుకుని ధర్నాకు దిగారు. హాల్ టికెట్స్, ప్లకార్డ్స్ చేతపట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడబోగా ప్రెస్ మీట్‌కి అనుమతి లేదంటూ పోలీసులు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

తాము నిరుద్యోగులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ శాంతియుతంగానే ఆందోళనలు చేపడుతున్నప్పటికీ పోలీసులే జులుం ప్రదర్శించి పరిస్థితిని ఉద్రిక్తం చేస్తున్నారని ఆందోళనకారులు అభిప్రాయపడ్డారు. రేపటి 21వ తేదీ నుండే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రభుత్వం ఇంకెప్పుడు స్పందిస్తుందనే టెన్షన్ అభ్యర్థుల్లోనూ అంతకంతకూ పెరిగిపోతోంది.

నిన్న సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చిన గ్రూప్ 1 అభ్యర్థులు ఇవాళ గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. మరోవైపు గ్రూప్ 1 అభ్యర్థులను ఎలాగైనే సరే గాంధీ భవన్ వైపు వెళ్లకుండా చూడాలనే లక్ష్యంతో భారీ సంఖ్యలో పోలీసులు మొహరించారు. అశోక్ నగర్ నుండి గాంధీ భవన్ వైపు దారితీసే మార్గాలన్నీ పోలీసులతో నిండిపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories