ఏపీ బాటలోనే తెలంగాణ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మంది పిల్లలున్నా పోటీకి ఛాన్స్?

Telangana Govt to Amend Laws on Local Body Elections
x

ఏపీ బాటలోనే తెలంగాణ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మంది పిల్లలున్నా పోటీకి చట్టసవరణ?

Highlights

Local Body Elections: ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేసింది.

Local Body Elections: ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేసింది. నవంబర్ 19న ఏపీ అసెంబ్లీ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది.తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే దిశగా అడుగులు వేస్తోంది.

చట్ట సవరణ ఎందుకు చేశారంటే?

1989-90 మధ్య కాలంలో దేశంలో జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మంది పిల్లలున్న వ్యక్తులు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులుగా 1994 మే 30న బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే రాష్ట్రంలో మారిన పరిస్థితుల నేపథ్యంలో ఎక్కువ మంది పిల్లలను కనాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారంగా సంతానోత్పత్తి రేటు తగ్గింది. 1993-94 లో 3.7 శాతంగా ఉంది. అయితే ఈ రేటు ఇప్పుడు 2.1కి పడిపోయింది. ఏపీ రాష్ట్రంలో ఇది 1.6కి తగ్గింది. 15 ఏళ్ల వయస్సున్న వారి సంఖ్య భారీగా తగ్గింది. 2015-16 నాటికి దేశ జనాభాలో 15 ఏళ్ల వయస్సున్నవారు 28.6 శాతం ఉంటే ఇప్పుడు 2 శాతానికి తగ్గింది. ఈ గణాంకాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మంది పిల్లలను కనాలని చంద్రబాబు కోరారు.

తెలంగాణలో కూడా

ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులని తెలంగాణ పంచాయితీరాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 213 చెబుతోంది. అయితే తెలంగాణ మున్సిపాలిటీ చట్టం ప్రకారంగా కౌన్సిలర్, మేయర్, కార్పోరేటర్, ఛైర్మన్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధులకు ఎంతమంది పిల్లలున్నా పోటీ చేసేందుకు ఇబ్బందులు లేవు. అయితే గ్రామీణ ప్రాంతంలో ఒక రకంగా, మున్సిపాలిటీల్లో మరో రకంగా చట్టాలున్నాయి. దీనిపై న్యాయవాది రాపోలు భాస్కర్ 2023 డిసెంబర్ లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీ తరహాలోనే చట్ట సవరణ చేసే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories