రాష్ట్రంలో అన్ని పరీక్షలు వాయిదా : మంత్రి సబిత

రాష్ట్రంలో అన్ని పరీక్షలు వాయిదా : మంత్రి సబిత
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో నిర్వహించే అన్ని రకాల పరీక్షలను దసరా వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది....

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో నిర్వహించే అన్ని రకాల పరీక్షలను దసరా వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వర్షాల సమయంలో పరీక్షలు నిర్వహిస్తే చాలా మంది విద్యార్థులకు సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీలు, కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించాల్సిన ఎంబీఏ, డిగ్రీ సెమిస్టర్, బీఈడీ పరీక్షలు సైతం ఇటీవల వాయిదా పడ్డాయి.

ఈ నెల 19 నుంచి 20 వరకు జరిగే పరీక్షలను వాయిదా వేసుకున్నాయి. అయితే వాయిదా పడిన పరీక్షలను ఈ నెల 21న నిర్వహిస్తామని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే అన్ని ప్రవేశ పరీక్షలతోపాటు యూజీ, పీజీ, ఇంజినీరింగ్‌ పరీక్షలను మరో మారు వాయిదా వేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇక ఈ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇదిలాఉండగా ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు కూడా ఈ నెల 31 వరకు గడువు పొడిగిస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories