Telangana: ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న పేదలకు గుడ్‌న్యూస్

Telangana Government
x

తెలంగాణ ప్రభుత్వం (ఫైల్ ఇమేజ్)

Highlights

Telangana: పేదల ఇళ్లను రెగ్యులరైజేషన్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయం. కసరత్తులు ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana: ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో గుడ్‌న్యూస్‌ చెప్పేందుకు రెడీ అవుతోంది. ఆ స్థలాలు మీకే సొంతం పక్కా ఇల్లు కట్టేసుకోవచ్చని అనుమతులు ఇవ్వనుంది. దీనికి కావాల్సిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసే పనులో పడ్డారు అధికారులు. అవన్నీ పూర్తయ్యాక కొన్ని రూల్స్ నిర్ధేశిస్తూ పర్మిషన్లు ఇవ్వనుంది ప్రభుత్వం.

ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న నిరుపేదలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. లక్షలాది నిరుపేద జీవితాల్లో వెలుగులు నింపే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.

పేదల ఇళ్లను రెగ్యులరైజేషన్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 125 గజాల లోపు ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకున్న పేదలకు ఉచితంగా రెగ్యులరైజేషన్ చేయనున్నారు. 250 గజాల లోపు ఇల్లు కట్టుకున్న వారికి 50 శాతం ఫీజు కట్టాలని ప్రభుత్వం సూచించనుంది. అదే వెయ్యి గజాల లోపు ఇల్లు కట్టుకుంటే మార్కెట్ విలువలో 50శాతం చెల్లించాల్సిందే అంటూ ప్రభుత్వం ప్రకటించనుంది. వెయ్యి గజాల కంటే ఎక్కువ ఉంటే మొత్తం డబ్బులు చెల్లించాక తప్పదు.

ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకున్న పేదల కోసం 2014 డిసెంబర్ 31న జీవో నెంబర్ 58, జీవో 59లను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. 59 జీవో ప్రకారం ఫీజు చెల్లించిన కొన్ని రెగ్యులరైజేషన్లు నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు ఈ కొత్త పథకంతో

125 గజాల లోపు ఉంటే ఉచితంగా రెగ్యులరైజేషన్ అవుతుంది. కానీ 150 గజాల లోపు మురికివాడల్లో ఉంటే 10 శాతం రిజిస్ట్రేషన్ విలువలు చెల్లించాల్సి ఉంటుంది. 250 గజాల లోపు 25శాతం, 500 గజాల లోపు ఉంటే 50శాతం చెల్లించక తప్పదు. ఇలా ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగే అవకాశముంది.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మార్కెట్ విలువలు ఎక్కువగా ఉన్నాయి. దరఖాస్తుదారులకు భారం కాకుండా దశలవారీగా నగదు చెల్లింపులకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. మొత్తానికి ప్రభుత్వం మరో కొత్త ఆలోచనతో రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే గతంలో లాగా కాకుండా చాలా పకడ్బందీగా నిరుపేదల సొంత ఇంటి కల సాకారం చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories