Money: వారి అకౌంట్లోకి రూ. 5లక్షలు..తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..పూర్తి వివరాలివే

Telangana Stree Nidhi Scheme
x

Telangana Stree Nidhi Scheme

Highlights

Money: ఏదైనా పథకం తీసుకువచ్చాక..దాన్ని అమలు చేయడం..ప్రయోజనాలను పేదలు పొందడం చాలా ముఖ్యం. ఈ విషయం తెలంగాణ సర్కార్ విఫలం అయ్యిందన్న వార్తలు...

Money: ఏదైనా పథకం తీసుకువచ్చాక..దాన్ని అమలు చేయడం..ప్రయోజనాలను పేదలు పొందడం చాలా ముఖ్యం. ఈ విషయం తెలంగాణ సర్కార్ విఫలం అయ్యిందన్న వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ పరిస్థితుల్లో రూ. 5లక్షలు ఇస్తామనే ప్రకటన మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తయ్యింది. డిసెంబర్ 7వ తేదీ వస్తే ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ఏం చేసిందంటే చెప్పుకునేందుకు కొన్ని అంశాలు ఉన్నాయి. మహిళలు ఫ్రీ బస్సు జర్నీ, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, రూ. 500కే వంటగ్యాస్ సిలిండర్, రైతులకు రూ. 2లక్షల వరకు రుణమాఫీ కీలకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ హామీలను నెరవేర్చిన ప్రభుత్వం మరికొన్ని కొత్త స్కీములను తీసుకువచ్చింది.

ఇందిరా మహిళా శక్తి స్కీములో భాగంగా మహిళలతో క్యాంటీన్లు ప్రారంభిస్తోంది. వ్యవసాయ యంత్రాలు, వాహనాలను అద్దెకు ఇస్తోంది. సోలార్ పవర్ ప్లాంట్స్ కూడా పెట్టిస్తోంది. స్వయం సహాయక గ్రూపుల్లో సభ్యులైన మహిళల ద్వారా ఆర్టీసీ బస్సులు కొని మహిళలే వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా చేస్తోంది. మహిళలను కోటీశ్వరులుగా మార్చే లక్ష్యంతో వారికి స్త్రీ నిధి స్కీములో భాగంగా లోన్స్ కూడా ఇప్పిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు కొన్ని చేస్తోంది.

ఇదంతా బాగానే ఉన్నప్పటికీ పథకాల అమలు మాత్రం సరిగ్గా లేదన్న విమర్శలు వస్తున్నాయి. రైతు రుణమాఫీ ఇంకా సగం మంది రైతులకు రాలదేనే విమర్శలు కూడా ఉన్నాయి. ఫ్రీ విద్యుత్, వంటగ్యాస్ సబ్సిడీ వంటివి తమకు రావట్లేదని అంటున్నారు. తప్పు ఎక్కడ జరుగుతోందనేది తేలాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఇలాంటి రివ్యూ జరగడం లేదని తెలుస్తోంది. పథకం ప్రారంభించామా లేదా అన్నదే చూస్తున్నారు కానీ సరిగ్గా అమలు అవుతోందా దాని ప్రయోజనాలు పేదలు పొందుతున్నారా లేదా అనేది పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్దిదారులకు రూ. 5లక్షలు ఇచ్చేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించలేకపోయినవారికి ప్రభుత్వమే ఇల్లు నిర్మించుకునేలా ప్లాన్ చేస్తోంది. దీనికోసం వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ చేయనుంది. ఇలా రూ. 5లక్షలను ఒకేసారి కాకుండా విడతల వారీగా నాలుగు సార్లు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల స్కీములో భాగంగా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లను నిర్మించనుంది. దీనికి ఎవరు లబ్దిదారులనేది త్వరలోనే నిర్ణయిస్తారు. గ్రామల్లో సభలు పెట్టి, వాటిలో లబ్దిదారులను సెలక్ట్ చేస్తారు. సర్కార్ ఇచ్చే డబ్బుతో సొంత స్థలం ఉన్నవారు 400 చదరపు అడుగుల్లో కొత్త ఇల్లు నిర్మించుకోవాలి. స్థలం లేనివారికి ప్రభుత్వమే స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకునేలా చేయాలనే ప్లాన్ లో సర్కార్ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories