కేటీఆర్ అరెస్టుపై ఏమీ చెప్పలేను:పొంగులేటి

Telangana government will act as per law on KTR E formula case says  ponguleti Srinivas Reddy
x

కేటీఆర్ అరెస్టుపై ఏమీ చెప్పలేను:పొంగులేటి

Highlights

కేటీఆర్ అరెస్టుపై తానేమీ చెప్పలేనని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.ఈ -కార్ రేసు వ్యవహారంలో చట్టప్రకారంగానే దర్యాప్తు సాగుతుందని...

కేటీఆర్ అరెస్టుపై తానేమీ చెప్పలేనని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.ఈ -కార్ రేసు వ్యవహారంలో చట్టప్రకారంగానే దర్యాప్తు సాగుతుందని ఆయన అన్నారు.ఈ విషయంలో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి లభించిందన్నారు.

గవర్నర్ అనుమతి ఇస్తూ ఇచ్చిన దస్త్రాన్ని చీఫ్ సెక్రటరీ ఏసీబీకి పంపుతారని ఆయన తెలిపారు. చట్టప్రకారం ఏసీబీ దర్యాప్తు చేస్తుందన్నారు. గవర్నర్ అనుమతిపై కేబినెట్ లో చర్చ జరిగిందని ఆయన వివరించారు. ఈ వ్యవహారంలో జరిగిన దోపిడీపై కేబినెట్ లో చర్చించామన్నారు.

ఈ ఫార్ములా రేస్ విషయంలో నిబంధనలకు విరుద్దంగా విదేశీ కరెన్సీలో చెల్లించారని కేటీఆర్ పై తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. ఈ విషయమై కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ విషయంలో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ ను రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది. దీనికి గవర్నర్ సానుకూలంగా స్పందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories