Karne Prabhakar strong counter to oppositions: కాంగ్రెస్‌ నేతలు అభివృద్ధిని అడ్డుకుంటూ వికృతానందం పొందుతున్నారు : ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌

Karne Prabhakar strong counter to oppositions: కాంగ్రెస్‌ నేతలు అభివృద్ధిని అడ్డుకుంటూ వికృతానందం పొందుతున్నారు : ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌
x
Telangana government whip Karne Prabhakar strong counter to oppositions
Highlights

Karne Prabhakar strong counter to oppositions: తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ మండలిలో విమర్శించారు.

Karne Prabhakar strong counter to oppositions: తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ మండలిలో విమర్శించారు. శనివారం శాసన మండలి ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా ఆస్పత్రిలో నీరు రాగానే కాంగ్రెస్ నేతులు హల్ చల్ చేస్తున్నారని, గతంలో ఉస్మానియా ఆస్పత్రిని కొత్తగా నిర్మిస్తామని సీఎం అనగానే దాన్ని అడ్డుకుంటామని కాంగ్రెస్‌ నేతలు ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రికి సంబంధించి పుననిర్మాణ పనులను అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో గ్రామాల్లో ఉండే ప్రజలకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కడుతున్నప్పుడుకూడా కాంగ్రెస్ నేతలు వికృత చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. మిషన్‌ భగీరథకు ఆర్థిక సాయం చేయొద్దని కేంద్రానికి కాంగ్రెస్‌ నేతలు లేఖరు రాశారని వెల్లడించారు.

పాలనా సౌలభ్యంకోసమే పాత సచివాలయాన్ని కూల్చి, కొత్త సచివాలయం నిర్మించాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్‌ భవనంలో పార్కింగ్‌ స్థలం, క్యాంటీన్‌ కూడా లేవని ఆయన స్పష్టం చేసారు. కార్యాలయాలు కూడా అన్ని ఒక చోట లేవని వాటిని కూడా ఒకే గొడుగు కిందికి తేవడానికే కొత్త సచివాలయ నిర్మాణమని చెప్పారు. మంత్రిమండలి నిర్ణయాల్లో జోక్యంచేసుకోబోమని హైకోర్టు చెప్పినా కాంగ్రెస్‌ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ నేతలు అడ్డుపడకుంటే కొత్త సచివాలయం ఈపాటికే సగం పూర్తయ్యేదని తెలిపారు. ఇప్పటి నుంచి మాత్రమే కాదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి సమావేశాల్లోనే కాంగ్రెస్‌ నేతలు అభివృద్ధిని అడ్డుకుంటూ వికృతానందం పొందుతున్నారని, గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్నదని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories