Telangana: తెలంగాణ ప్రభుత్వం ఒక్క రోజులో రెండు రికార్డులు

Telangana Government Two Records in One Day
x

వాక్సినేషన్ &కరోనా టెస్టింగ్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Telangana: ఒకే రోజు లక్షకు పైగా కరోనా టెస్టులు * గడిచిన 24గంటల్లో 96,385 మందికి టీకా తొలి డోసు

Telangana: ఒకవైపు కరోనా పెచ్చరిల్లుతోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు వేగంగా తీసుకుంటోంది. తెలంగాణ వైద్యశాఖ ఒక్కరోజులో రెండు రికార్డులను సాధించింది. గత 24గంటల వ్యవధిలో అత్యధికంగా లక్షకు పైగా కొవిడ్ టెస్టులు చేసి రికార్డు సాధించింది. ఇదే వ్యవధిలో 96 వేల 385 మందికి కరోనా వ్యాక్సిన్ తొలి డోసును అందించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ వేల సంఖ్యలో ఉండేది. ఇప్పుడు ఒకేరోజు 96వేలకు పైగా టీకా ఇవ్వడం రికార్డనే చెప్పాలి.. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్న వారి సంఖ్య 15లక్షలకు చేరువలో ఉంది.

గడిచిన 24గంటల్లో రెండో డోసు 6వేల 501 మందికి ఇచ్చారు. దీంతో ఆసంఖ్య 2 లక్షల 83 వేల 407కు చేరింది. ఇక నుంచి రోజూ ప్రభుత్వ కేంద్రాల్లో 1.25లక్షల మందికి, ప్రైవేటులో 35వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు రాష్ట్రంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. గురువారం లక్షకు పైగా కొవిడ్ పరీక్షలు చేయగా.. వారిలో 2 వేల 478 మందికి వైరస్ నిర్దారణ అయింది. గతేడాది ఆగస్టు 22న ఇదే స్థాయిలో కరోనా కేసుల నమోదు అయ్యాయి. ఇప్పుడు మళ్లీ ఆ స్థాయికి పెరిగాయి.

మరోవైపు ఫ్రంట్‌లైన్ వర్కర్లు అందరికీ టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య, పోలీసు, పారిశుధ్య విభాగాల్లోని వారిని ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించి.. వారికి టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. అది 15 రోజుల్లో ప్రణాళిక పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సర్కార్ కార్యాచరణను చేపట్టింది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ శాఖలో 14 వరకు సెలవులు రద్దు చేశారు. జెడ్పీ చైర్మన్లు, ZPTC, MPTC, సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో పాటు ఉపాధి హామీ, సెర్ప్ ఉద్యోగులకు టీకాలు వేయించాలని సర్కార్ సూచించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories