ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్యార్థులంతా పాస్‌.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్యార్థులంతా పాస్‌.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పదోతరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా ఓపెన్‌ స్కూల్‌ టెన్త్, ఇంటర్‌ విద్యార్థులందరినీ పాస్‌ చేస్తూ...

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పదోతరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా ఓపెన్‌ స్కూల్‌ టెన్త్, ఇంటర్‌ విద్యార్థులందరినీ పాస్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులందరికీ 35 మార్కులు ఇవ్వాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో పదో తరగతిలో 35 వేలు, ఇంటర్‌లో 43 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేయాలని ఓసెన్‌ స్కూల్స్‌ సొసైటీ డైరెక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర శర్మ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయం విదితమే. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి విద్యార్థులందరినీ పాస్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories