HYDRAA: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైడ్రా కూల్చివేతలు నిలుపుదల..?

Telangana Government ordered a Comprehensive Survey of Ponds Under HMDA
x

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైడ్రా కూల్చివేతలు నిలుపుదల..?

Highlights

HYDRAA: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. hmda పరిధిలోని చెరువులపై సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

HYDRAA: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. hmda పరిధిలోని చెరువులపై సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. గ్రేటర్‌లోని చెరువుల విస్తీర్ణం, FTL, బఫర్‌జోన్‌‌లను గుర్తించాలని నిర్ణయం తీసుకుంది. ఇక మూడు నెలల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే పూర్తయ్యాక వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచే అవకాశం ఉంది. అయితే సర్వే పూర్తయ్యే వరకు హైడ్రా కూల్చివేతలు నిలిపివేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇటీవలే ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఆక్రమణలు హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ కూల్చివేతలపై కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే విచారణ సందర్శంగా చెరువుల FTL పరిధిని నిర్ధారించారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్ట్. ఈ క్రమంలోనే ముందుగా ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లను గుర్తించాలని ఆదేశించింది ప్రభుత్వం. మరి అప్పటి వరకు హైడ్రా కూల్చివేతలు ఉంటాయా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories