Telangana: బడ్జెట్‌కు సమాయాత్తమవుతోన్న తెలంగాణ ప్రభుత్వం

Telangana Government Is Ready for the Budget session
x

ఫైల్ ఇమేజ్ 

Highlights

Telangana: తెలంగాణ ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌కు సమాయాత్తమవుతోంది.

Telangana: తెలంగాణ ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌కు సమాయాత్తమవుతోంది. బడ్జెట్‌ రూపకల్పనపై కేసీఆర్‌ దృష్టి సారించారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ తెలంగాణ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులు రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలను కేసీఆర్‌కు అందజేశారు. కేసీఆర్ ఆమోదం తర్వాత ఫైనల్ గా బడ్జెట్ సిద్ధం కానుంది. ఈనెల 15 తరువాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఈ సమావేశాలను దాదాపు 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. సమావేశాలకు సంబంధించి రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

కొవిడ్‌ సృష్టించిన కల్లోలం నుంచి కోలుకొని వివిధ రంగాలను పునరుద్ధరించుకునే క్రమంలో ప్రభుత్వం నెమ్మదిగా అడుగులు వేస్తోంది. నేలచూపులు చూస్తున్న రంగాలకు ఊపిరిలూది వాటిని తిరిగి మేలుబాట పట్టించడం ఏ ప్రభుత్వానికైనా కత్తిమీద సామే. ఈ నేపథ్యంలో తెలంగాణ బడ్జెట్‌ ఎలా ఉంటుందని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 1.82 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కరోనా, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఆశించిన స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం రాలేదు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ను సుమారుగా 20 శాతం వరకు తగ్గించాలని సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు బడ్జెట్ ఫైల్స్‌ని అధికారులు సీఎంకు అందించారు. వీటిపై పూర్తి స్థాయిలో మరోసారి చర్చిస్తామని సీఎం అధికారులకు తెలిపారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి రాష్ట్ర బడ్జెట్‌ను అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తున్నారు అధికారులు. ప్రస్తుత రాబడి, వ్యయాలకు అనుగుణంగా పద్దులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు ఎన్ని..? ఖజానాకు సమకూరే సొంత రాబడులు ఎన్ని..? కేంద్ర బడ్జెట్ తర్వాత నిధులు, నిధుల కోత, బడ్జెట్ కేటాయింపుల ప్రాధాన్యతపై కూడా దృష్టి సారించారు.

కరోనాతో ఆర్థిక ఇబ్బందులున్నా సాగునీటి రంగంపై రాష్ట్ర ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసింది. చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లులు పెద్ద మొత్తంలోనే పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్ర బడ్జెట్‌, బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణాలతో కలిపి 15వేల 150 కోట్లు ఖర్చు చేసింది. గుత్తేదారులు చేసిన పనులు, భూసేకరణ, పునరావాసానికి చెల్లించాల్సిన మొత్తం, విద్యుత్తు బిల్లులు కలిపి సుమారు రూ.10,500 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో చేసిన ఖర్చులో సగానికి పైగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోనివే. ఈ ప్రాజెక్టులో బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణంతో చెల్లించింది ఎక్కువ.

మొత్తానికి బడ్జెట్ ప్రతిపాదనలను తుదిరూపు చేరుకున్నాయి. సీఎం కేసీఆర్ ఆమోదం తర్వాత ఫైనల్ బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం కానున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లోనే పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పన పూర్తి అవుతుందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories