Telangana Government : విద్యార్థి వద్దకే టీచర్.. గిరిజన ప్రాంతాల్లో అమలు

Telangana Government : విద్యార్థి వద్దకే టీచర్.. గిరిజన ప్రాంతాల్లో అమలు
x
Highlights

Telangana Government | గిరిజన ప్రాంతాల్లో విద్యను పూర్తిస్థాయిలో అందించేందుకు ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నా అది ఆదివాసీల చెంతకు చేరడం లేదు.

Telangana Government | గిరిజన ప్రాంతాల్లో విద్యను పూర్తిస్థాయిలో అందించేందుకు ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నా అది ఆదివాసీల చెంతకు చేరడం లేదు. ఎందుకంటే ఈ గూడెంలు దూరంగా విసిరేసినట్టు ఉండటం, తక్కువ మంది ఉండే విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు శ్రద్ధ చూపించకపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో టీచర్లే తన విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్ల ఈ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి కుంటుపడుతూ వస్తోంది. ఈ కారణాల వల్ల ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నాగిరిజన ప్రాంతాల్లో అక్షరాస్యత పెరగడం లేదు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం తక్కువ విద్యార్థులుండే గ్రామాల్లో నేరుగా విద్యార్థి ఇంటి వద్దకు వెళ్లి బోధన చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై కొన్ని ప్రత్యేక ప్రాంతాలను గుర్తించిన తెలంగాణా ప్రభుత్వం వీటిపై ప్రత్యేక చర్యలు చేపట్టింది.

ఇక ఆన్ లైన్ చదువుల విషయానికొస్తే కరోనా నేపథ్యంలో విద్యా వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌ బోధనకు శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు జరగనున్నాయి. ప్రభుత్వ నిర్ణయం మంచిదే అయినప్పటికీ ఎంతమందికి ఈ విద్య చేరువ అవుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. అక్షరాస్యతతో పాటు ఆర్థికంగా ఆదిలాబాద్‌ జిల్లా వెనుకంజలో ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని గూడెలు, తండాల్లో నివసించే చాలా మందికి స్మార్ట్‌ ఫోన్లు, టీవీలు లేకపోవడంతో వీరికి ఆన్‌లైన్‌ బోధన ఎలా సాగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అయితే అందరికి ఆన్‌లైన్‌ విద్య అందే విధంగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.విద్యార్థులు బడికి వెళ్లి చదువుకోవడం, లాక్‌డౌన్‌ కారణంగా ఆన్‌ లైన్‌ పాఠాలు, టీవీల్లో వీడియో తరగతులు వినడం చూశాం. కానీ, గిరిజన సంక్షేమ శాఖ బోధన ప్రక్రియలో సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఆ శాఖ పరిధిలోని ఆశ్రమ, ప్రభు త్వప్రాథమికోన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం బడినే ఇంటివద్దకు తీసుకెళ్తోంది. ఆన్‌లైన్‌ , వీడియో పాఠాలతో పాటు సంబం ధిత బోధకుడు నేరుగా విద్యార్థి ఇంటికి వెళ్లి 2గంటల పాటు పాఠ్యాంశాన్ని బోధిస్తారు. ఈ మేరకు చర్యలు చేపట్టాల్సిందిగా గిరిజన సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఇంటింటికీ చదువు...

గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో దాదాపు 320 ఆశ్రమ పాఠశాలలు, 1,510 ప్రభుత్వ పాథమిక పాఠశాలలు (జీపీఎస్‌) ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడితో పాటు టీచర్లు, సీఆర్‌టీ(కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్‌)లు ఉంటారు. తాజాగా హెచ్‌ఎంలు, టీచర్లు, సీఆర్‌టీలు ఏయే రకమైన విధులు నిర్వహించాలనే దానిపై గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రతి ఉపాధ్యాయుడు, సీఆర్‌టీ ఆయా తరగతిలోని పిల్లల్ని అడాప్ట్‌ చేసుకుని బోధన, అభ్యసన కార్యక్రమాలు కొనసా గించాలి. గిరిజన ఆవాసాల్లో ఉండే జీపీఎస్‌లలో ఒక్కో టీచర్‌ ఉండగా... 10 మందిలోపు పిల్లలున్నారు. ఈ స్కూళ్లలో పనిచేసే టీచర్లు పూర్తిగా అదే ఆవాసానికి చెందిన వారే కావడంతో స్థానికంగా విద్యార్థి ఇంటికి వెళ్లి బోధ న, అభ్యసన కార్యక్రమాలు నిర్వహించడం ఇబ్బందికరమేమీ కాదు. విద్యార్థికి బోధన కార్యక్రమాలను మరింత చేరువ చేసేందుకే ఆ శాఖ ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories