Telangana Govt LRS Scheme: దేవాదాయ, వక్ఫ్ బోర్డు,కోర్టు ఆదేశాలు ఉన్న భూములు తప్ప.. ఇతర లే అవుట్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయం
Telangana Govt LRS Scheme: 2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31లోగా దరఖాస్తుదారులకు లే-అవుట్ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్ లను క్రమబద్ధీకరించాలని ఆదేశించింది. గత ప్రభుత్వం లేఅవుట్ల క్రమబద్దీకరణ కోసం LRS తీసుకురాగా.. భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ఆ దరఖాస్తులన్నీ పెండింగ్లోనే ఉండటంతో.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో 20లక్షల మంది దిగువ, మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరగనుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire