Independence Day 2020: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో జెండా ఆవిష్కరణకు ప్రతినిధుల పేర్లు విడుదల చేసిన తెలంగాణా ప్రభుత్వం!

Independence Day 2020: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో జెండా ఆవిష్కరణకు ప్రతినిధుల పేర్లు విడుదల చేసిన తెలంగాణా ప్రభుత్వం!
x
Independence day 15th August
Highlights

Independence Day 2020: అసలే కోవిద్.. ఏ వేడుకులకు అవకాశం లేదు. అయినా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాల్సిన పరిస్థితి.

Independence Day 2020: అసలే కోవిద్.. ఏ వేడుకులకు అవకాశం లేదు. అయినా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాల్సిన పరిస్థితి. దీనికి తెలంగాణా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జెండా ఆవిష్కరణకు సంబంధించి జిల్లాల వారీగా ప్రతినిధుల జాబితాన ప్రకటించింది.

స్వాతంత్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే ప్రముఖుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆగస్టు 15వ తేదీన ఉదయం 10 గంటలకు ఆయా జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్‌లలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. కొవిడ్‌ నిబంధనలకు లోబడి పంద్రాగస్టు వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి జిల్లా కేంద్రంలో మంత్రులు, ప్రభుత్వ చీఫ్‌విప్‌, విప్‌లు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్‌పర్సన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొననున్నారు.

* జాతీయ జెండాను ఆవిష్కరించే ప్రముఖులు:

* ఆదిలాబాద్‌ - ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌

* భద్రాద్రి కొత్తగూడెం - ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు

* జగిత్యాల - మంత్రి కొప్పుల ఈశ్వర్‌

* జయశంకర్‌ భూపాలపల్లి - ప్రభుత్వ విప్‌ భాను ప్రసాదరావు

* జనగామ - ప్రభుత్వ చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు

* జోగులాంబ గద్వాల - ప్రభుత్వ విప్‌ దామోదర్‌ రెడ్డి

* కామారెడ్డి - స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

* ఖమ్మం - మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌

* కరీంనగర్‌ - మంత్రి గంగుల కమలాకర్‌

* కుమ్రంభీం ఆసిఫాబాద్‌ - ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీ

* మహబూబ్‌నగర్‌ - మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

* మహబూబాబాద్‌ - మంత్రి సత్యవతి రాథోడ్‌

* మంచిర్యాల - ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌

* మెదక్‌ - మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

* మేడ్చల్‌ మల్కాజ్‌గిరి - మంత్రి మల్లారెడ్డి

* ములుగు - ప్రభుత్వ విప్‌ ప్రభాకర్‌రావు

* నాగర్‌కర్నూల్‌ - ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు

* నల్లగొండ - మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి

* నారాయణపేట - మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌

* నిర్మల్‌ - మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

* నిజామాబాద్‌ - మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి

* పెద్దపల్లి - మంత్రి ఈటల రాజేందర్‌

* రాజన్న సిరిసిల్ల - మంత్రి కేటీఆర్‌

* రంగారెడ్డి - మంత్రి సబితా ఇంద్రారెడ్డి

* సంగారెడ్డి - మంత్రి మహముద్‌ అలీ

* సిద్దిపేట - మంత్రి హరీష్‌రావు

* సూర్యాపేట - మంత్రి జగదీష్‌ రెడ్డి

* వికారాబాద్‌ - డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు

* వనపర్తి - మంత్రి నిరంజన్‌ రెడ్డి

* వరంగల్‌ రూరల్‌ - మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

* వరంగల్‌ అర్బన్‌ - ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ భాస్కర్‌

* యాదాద్రి భువనగిరి - ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి

Show Full Article
Print Article
Next Story
More Stories