Aarogyasri Digital Card: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఉచితంగా రూ.5 లక్షల బీమా.. కేసీఆర్ కీలక నిర్ణయం..!

Telangana Government has Given Digital Aarogyasri Cards With RS 5 Lakh Insurance Coverage Very Soon
x

Aarogyasri Digital Card: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఉచితంగా రూ.5 లక్షల బీమా.. కేసీఆర్ కీలక నిర్ణయం..!

Highlights

Aarogyasri Digital Cards: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది. డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డులను కొత్తగా జారీ చేయాలని చూస్తోంది. ఈమేరకు ఇప్పటికే కార్యచరణ కూడా మొదలుపెట్టింది.

Aarogyasri Digital Cards: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది. డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డులను కొత్తగా జారీ చేయాలని చూస్తోంది. ఈమేరకు ఇప్పటికే కార్యచరణ కూడా మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే ఆరోగ్య శ్రీ పథకం ద్వారా అందిస్తోన్న బీమా కవరేజీని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచేందుకు డెషిషన్ తీసుకుందంట. ఈమేరకు నూతన డిజిటల్ కార్డులను ప్రింట్ చేసి, లబ్ధిదారులకు అందివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారంట.

కాగా, లబ్ధిదారులను ఐడెంటిఫై చేసేందుకు బయోమెట్రిక్ విధానాన్ని వాడుతున్నారు. బయోమెట్రిక్ విధానానికి బదులు ఇక నుంచి ఫేషియల్ రికాగ్నినైజేషన్ విధానాన్ని ఉపయోగించనున్నట్లు చెబుతున్నారు. ఈమేరకు అవసరమైన టెక్నాలజీని కూడా సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆధార్‌తో లబ్ధిదారులు, వారి చిరునామాలను కనుగొని, ఆ తర్వాత డిజిటల్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అధికారులతో సమీక్షా సమావేశం చెపట్టారు. ఈమేరకు డిజిటల్ కార్డులపై పలు కీలక సూచనలు అందించారు.

దీంతో ఈ ప్రక్రియ వేగంగా మొదలైంది. కొత్త ఆరోగ్య శ్రీ డిజిటల్ కార్డులను వచ్చే వారం నుంచి పంపిణీ చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులకు సూచించారు. ఈమేరకు నిమ్స్ కు చెందిన డాక్టర్ల బృందాన్ని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ సేవలపై ఆడిట్ నిర్వహించేందుకు నియమించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories