ఎంట్రెన్స్, ఇతర ప్రవేశ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ..

ఎంట్రెన్స్, ఇతర ప్రవేశ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ..
x
Entrance Exams in Telangana
Highlights

Telangana Govt Clarity on Entrance Exams:మార్చి నెల మూడవ వారం నుంచి కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు మూతబడ్డాయి.

Telangana Govt Clarity on Entrance Exams:మార్చి నెల మూడవ వారం నుంచి కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు మూతబడ్డాయి. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు కూడా మూత పడ్డాయి. ఇక కొన్ని పరీక్షలను రద్దు చేస్తే మరికొన్ని పరీక్షలను వాయిదా వేశారు. ప్రస్తుతం కొన్ని విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసులను నిర్వహిస్తున్నాయి. అయితే, ఇన్నాళ్ళు మూసి ఉంచిన‌ పాఠ‌శాల‌ల‌ను తిరిగి ప్రారంభించేందుకు ఇంకా సమయం పట్టే అవకాశముంది అని తెలుస్తుంది. విద్యా సంవత్సరం, పాలసీపై సీఎం కేసీఆర్ కొన్ని సూచనలు చేశారని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు.

ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రితో సమావేశమై ఈ విషయంపై ప్రణాళికలు రూపొందిస్తామని ఆయన తెలిపారు. ఆన్‌లైన్, దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్పివిదంగా ఆలోచిస్తున్నామని.. ఆన్‌లైన్ విద్యాబోధన కోసం రెండు చానల్స్ ను హైర్ చేసుకొవాలని అనుకుంటున్నట్లు చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. అయితే, ప్రస్తుతం ఎంట్రెన్స్ మరియి ఇతర ప్రవేశ పరీక్షలపై హైకోర్టులో పిల్ ఉందని.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో ఎంట్రన్స్ టెస్ట్లు నిర్వహించకపోతే విద్యార్దులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. అంతే కాదు ప్రస్తుతం కోర్ట్ కేసులు క్లియర్ అయితే ఎంట్రెన్స్ టెస్టుల షెడ్యూల్‌పై స్పష్టత ఇస్తామని విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు.

ఇక కారోనా కాసుల పరిస్తితి చుస్తే.. కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న(బుధవారం) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,092 పాజిటివ్ ‌కేసులునమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 73,050కి చేరింది. మృతుల సంఖ్య 589కి పెరిగింది. సోమవారం ఒక్క రోజే 1,289 మంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 52,103కి చేరింది. ప్రస్తుతం 20,358 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 21,346 మంది నమూనాలను పరీక్షించగా, 2,092 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

రాష్ర్టంలో ఇప్ప‌టి వ‌ర‌కు 5,43,489 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. బుధవారం నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ఇంకా 1,550 మంది ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 535, మేడ్చెల్-126, రంగారెడీ-169, వరంగల్ అర్బన్-128, సంగారెడ్డి-100, నిజామాబాద్-91 కేసులునమోదుఅయ్యాయి. రాష్ట్రంలో రికవరీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది ప్రస్తుతం రికవరీ రేట్ 71.3గా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 320 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నట్లు.. ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 0.81 శాతంగా ప్రభుత్వం చెప్పింది. దేశంలో అది 2.11 శాతంగా ఉందని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories