Telangana: ఆదాయమార్గాలపై తెలంగాణ సర్కార్‌ దృష్టి

Telangana Government Focus on Financial Sources
x

Telangana: ఆదాయమార్గాలపై తెలంగాణ సర్కార్‌ దృష్టి

Highlights

Telangana: ఆదాయమార్గాలపై తెలంగాణ సర్కార్‌ దృష్టి సారించింది.

Telangana: ఆదాయమార్గాలపై తెలంగాణ సర్కార్‌ దృష్టి సారించింది. ఇందులో భాగంగా నిరూపయోగంగా ఉన్న భూములను అమ్మకాలకు ప్లాన్ చేసింది. అంతే కాకుండా స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్‌, ఆర్టీసీ, ఎక్సైజ్, విద్యుత్ విభాగాల ద్వారా మరింత ఆదాయం పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం.

ప్రభుత్వం ఆర్థికలోటును పూడ్చుకునేందుకు ఆదాయమార్గాలపై దృష్టి పెట్టింది. నిరూపయోగంగా ఉన్న భూముల విక్రయాలకు ప్లాన్ చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని కోకాపేట, ఖానామెట్లలో మొదటి దశ భూ వేలం కోసం ప్రభుత్వం టెండర్స్‌ను పిలిచింది. హైదరాబాద్‌ నగర శివారులో ఉన్న భూములతో పాటు జిల్లాల్లో ఉన్న భూములను అమ్మనుంది ప్రభుత్వం. ఆదాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 25 కోట్ల రూపాయలతో టెండర్స్‌ను పిలిచింది. మొత్తం 65 ఎకరాలకు ధర 1,625 కోట్ల రూపాయలుగా ప్రాథమికంగా నిర్ణయించారు.

జూలై 15న జరగనున్న ఈవేలం ద్వారా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటిలో సుమారు 3వేల కోట్ల రూపాయలు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. హెచ్‌ఎండీఏ, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్- టీఎస్‌ఐఐసీ పరిధిలోని 13 ల్యాండ్ ప్లాట్లను విక్రయించనున్నారు. అదే విధంగా కోకాపేట, ఖానామెట్‌లోని గోల్డెన్‌మైల్ ప్రాజెక్టులను విక్రయించడానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మే నెలలో కరోనా తీవ్రం కావడం, ప్రభుత్వం లాక్‌డౌన్‌ వంటి చర్యలు తీసుకోవడంతో రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. మే నెలలో రిజిస్ట్రేషన్ల ద్వారా కేవలం 230 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 500 కోట్లు తక్కువ. మద్యం అమ్మకాల ద్వారా కూడా ఆదాయం పడిపోయింది. సేల్స్‌ ట్యాక్సు ఆదాయమూ తగ్గినట్టు సమాచారం. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచి ఆదాయాన్ని రాబట్టేందుకు చర్యలను ముమ్మరం చేసింది సర్కార్.

Show Full Article
Print Article
Next Story
More Stories