Tenth Class Marks System : తెలంగాణలో టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్..మార్కుల విధానంలో కీలక మార్పులు

Tenth Class Marks System : తెలంగాణలో టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్..మార్కుల విధానంలో  కీలక మార్పులు
x
Highlights

Telangana Govt changed Tenth Class Marks System : తెలంగాణలో టెన్త్ స్టూడెంట్స్ కు బిగ్ అలర్ట్. టెన్త్ లో గ్రేడ్ పద్ధతిని తొలగిస్తూ పాఠశాల విద్యాశాఖ...

Telangana Govt changed Tenth Class Marks System : తెలంగాణలో టెన్త్ స్టూడెంట్స్ కు బిగ్ అలర్ట్. టెన్త్ లో గ్రేడ్ పద్ధతిని తొలగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి గ్రేడింగ్ పద్దతికి బదులుగా ఫలితాల మార్కుల రూపంలో ఇవ్వనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇక ఇంటర్నల్ మార్క్స్ విధానాన్ని కూడా తొలగిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది.

గతంలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు 20 ఇంటర్నల్ మార్క్స్ , 80 మార్క్స్ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించేవారు. ఇకపై ఈ పద్ధతికి స్వస్తి పలుకుతూ 100 మార్కులకు ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.

దీంతోపాటు జవాబు పత్రాల్లోనూ మార్పులు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. 24 పేజీల బుక్ లెట్ ను విద్యార్థులకు అందించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. ఫిజిక్స్, బయాలజీ సబ్జెక్టులకు 12 పేజీల బుక్ లెట్స్ ఇవ్వున్నట్లు తేలిపింది. ఈ మేరకు విద్యార్థులకు సమాచారం అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రిన్సిపళ్లను ఆదేశించింది విద్యాశాఖ.

విద్యార్థుల మీద ఒత్తిడి పడుతుందని భావించి 11 పేపర్ల విధానాన్ని సర్కార్ రద్దు చేసింది. ఒక్కో సబ్జెక్టుకు ఒక పేపర్ చొప్పున మొత్తం 6 సబ్జెక్టులకు 6 పేపర్ల విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. తాజాగా ఇంటర్నల్ మార్కుల విధానాన్ని రద్దు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories