తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ !

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ !
x
Highlights

* బీజేపీలో చేరతానన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి * తెలంగాణలో హస్తం పార్టీకి భవిష్యత్ లేదన్న ఎమ్మెల్యే *ఆయన వ్యాఖ్యల వెనక కారణం ఏంటి ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయ్. ఇప్పటికే 12మంది ఎమ్మెల్యేలు కారెక్కితే మరొకరు కూడా ఇప్పుడు హస్తానికి హ్యాండ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని హాట్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్‌కి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అంటూ వ్యాఖ్యలు చేశారు.

పీసీసీ పదవికి ఉత్తమ్ రాజీనామా తర్వాత ఆ సీట్ కోసం కాంగ్రెస్‌లో గట్టి పోటీ కనిపించింది. ఆ పదవికి తమకే ఇవ్వాలంటూ తమకే ఇవ్వాలనంటూ పార్టీలో సీనియర్లంతా పట్టిన పట్టు వీడడం లేదు. సీనియర్లలో ఒకరికి ఇవ్వాలని అనుకుంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పదవి కట్టబెట్టాలని పార్టీ నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు కూడా ఇలాంటి పరిస్థితుల మధ్య పీసీసీ చీఫ్ పదవి ఫైనల్ రేసులో రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు కూడా వినిపించింది. నిజానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలోనే బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. సోదరునికి పీసీసీ చీఫ్ ఇస్తారని ఇన్ని రోజులు వెనకడుగు వేసినట్లు చర్చ జరిగింది. ఐతే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు తన మనసులో మాట బయటపెట్టడంతో వెంకట్ రెడ్డికి పీసీసీ రాదు అనే చర్చ సాగుతోంది.

వెంకట్ రెడ్డికి పీసీసీ సారధి బాధ్యతలు అప్పగిస్తే రాజగోపాల్ రెడ్డి ఎందుకు పార్టీ మారుతారన్న చర్చ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. అధిష్టానం నయ్ అనడంతోనే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఐతే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు నిర్ణయాన్ని విశ్లేషించిన తర్వాత రేవంత్ రెడ్డికే పీసీసీ చీఫ్ పదవి కన్ఫార్మ్ అయిందా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. హస్తం పార్టీ హైకమాండ్ నిర్ణయంపై అలిగిన ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories