Telangana Elections: సమీపిస్తున్న తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు

Telangana General Elections Are Approaching
x

Telangana Elections: సమీపిస్తున్న తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు

Highlights

Telangana Elections:

Telangana Elections: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రక్రియ వేగవంతం చేసింది ఎన్నికల కమిషన్. ఎన్నికల నిర్వహణ అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తోంది ఈసిఐ.ఎన్నికలు సజావుగా ,పారదర్శకంగా జరిపేందుకు ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల తీరును పరిశీలించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారులు రెండు రోజులపాటు కర్నాటక లో పర్యటించనున్నారు.

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షలు సమావేశాలతో బిజీ అయ్యింది. వచ్చే ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని నిర్ణయించారు . అయితే ఇటీవల కర్ణాటకలో జరిగిన సాధారణ ఎన్నికల పై అధ్యయనం చేసేందుకు అక్కడకు వెళ్లనున్నారు. అక్కడ వాడిన టెక్నాలజీని ఎలా ఉపయోగపడుతుంది.. రాష్ట్ర సాధారణ ఎన్నికలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాన్ని పరిశీలించనున్నారు. ఎన్నికలకు మరో రెండు నెలలు సమయం ఉన్న నేపథ్యంలో జిల్లాల వారీగా ఉన్న ఎన్నికల అధికారులతో సమీక్షలు, శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది.గత అనుభవాల దృష్ట్యా వచ్చే ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని చూస్తోంది ఎన్నికల సంఘం. ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్ల కు శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రభుత్వం సైతం ఎన్నికల దృష్ట్యా అన్ని శాఖల అధికారుల బదిలీలు పూర్తి చేస్తోంది.ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు.

పోలింగ్ స్టేషన్ లు ప్రస్తుతం 39 వేల పై చిలుకు ఉన్నాయి. అవసరం అయితే పోలింగ్ కేంద్రాల సంఖ్యను మరిన్ని పెంచుతాం అంటున్నారు అధికారులు. ఇక మరి ముఖ్యంగా రాష్ట్రంలో వీ ఆర్ వో లు, వీ ఆర్ ఎ వ్యవస్త లేకపోవడం తో అవసరమైన సంబంధిత శాఖల సిబ్బందిని వాడుకో నున్నారు. ఈవీఎం ల పనితీరు, సాంకేతిక పరమైన ఇబ్బందులు రాకుండా అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు సాంకేతిక పరిజ్ఞానం చాలా పెరిగింది అయితే ఎన్నికల నేపథ్యంలో ఆన్లైన్ లావాదేవీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు ఎన్నికల సంఘం అధికారులు దానికి సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభం అయింది.డబ్బుల లావాదేవీలు, ఇతర ఓటర్లను ప్రభావితం చేసే అంశాలను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంను వాడుతాం అంటున్నారు అధికారులు.

ఇక అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశాలు జరువుతున్నాం అని రానున్న రోజుల్లో ఎన్జీవో లతో కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తాం అంటున్నారు అయితే ఓటింగ్ శాతం పెంచేందుకు ఓటర్ చైతన్య యాత్రలు చేపట్టి అవగాహన పెంచుతాం అంటున్నారు ..ఎన్నికల నిర్వహణ, ఓటర్ల ను చైతన్యం చేయడానికి సోషల్ మీడియా ను బలోపేతం చేస్తున్నారు. పోలింగ్ శాతం గత ఎన్నికల కంటే ఈసారి మరింత పెంచేందుకు సోషల్ మీడియా అస్త్రాన్ని ఉపయోగించనున్నారు.అక్టోబర్ చివరి వారం లో ఎన్నికల షెడ్యూల్ వస్తే డిసెంబర్ నెలలో పోలింగ్ ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తి అవుతుండటం తో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి..ఈనేపథ్యంలో రాష్ట్రంలో పూర్తిగా ఎన్నికల హడావుడి కనిపిస్తుంది.ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణం లో వచ్చిన నిర్వహించేందుకు సిద్ధం అవుతుంది ప్రభుత్వం..

Show Full Article
Print Article
Next Story
More Stories