TS Voters List: తెలంగాణ తుది ఓటర్ల జాబితా ప్రకటించిన ఈసీ

Telangana Final Electoral List Announced By EC
x

TS Voters List: తెలంగాణ తుది ఓటర్ల జాబితా ప్రకటించిన ఈసీ

Highlights

TS Voters List: తెలంగాణలో 2,949 మంది NRI ఓటర్లు

TS Voters List: తెలంగాణలో ఈసీ తుది ఓటర్ల జాబితా ప్రకటించింది. తెలంగాణలో మొత్తం ఓటర్లు 3 కోట్ల, 26 లక్షల, 2వేల,799 మంది ఉన్నట్లు లిస్ట్ రిలీజ్ చేసింది ఈసీ. పురుషులు కోటి,63 లక్షల, 13వేల, 268 మంది... ఉండగా మహిళలు, కోటి, 63 లక్షల, 2వేల, 261 మంది ఉన్నారు. హైదరాబాద్‌లో అత్యధికంగా 45 లక్షల, 36వేల, 852 మంది ఓటర్లు ఉండగా.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అధికంగా 7లక్షల, 32వేల, 560 మంది ఓటర్లు, భద్రాచలంలో అతి తక్కువగా లక్షా, 48వేల, 713 మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణలో ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 2వేల,676 మంది, 18 ఏళ్ల నుంచి 19 ఏళ్ల యువ ఓటర్లు 9లక్షల, 99వేల, 667 మంది.. 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 4లక్షల, 40వేల, 371 మంది.... తెలంగాణలో 2వేల,949 మంది NRI ఓటర్లు ఉన్నట్లు సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు.



Show Full Article
Print Article
Next Story
More Stories