Telangana Exit Poll 2023: ముగిసిన 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ.. ఎగ్జిట్ పోల్స్‌తో సిద్ధమైన సర్వే సంస్థలు

Telangana Exit Poll 2023 Live Updates
x

Telangana Exit Poll 2023: ముగిసిన 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ.. ఎగ్జిట్ పోల్స్‌తో సిద్ధమైన సర్వే సంస్థలు

Highlights

Telangana Exit Poll 2023: అధికార పార్టీకే మరోసారి పట్టం కడతారా.. మార్పు కోరుకుంటున్నారా..?

Telangana Exit Poll 2023: తెలంగాణలో ఓట్ల జాతరకు తెర పడింది. 2 నెలలుగా కొనసాగిన ఎన్నికల తంతు ప్రశాంతంగా ముగిసింది. దీంతో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా కంప్లీట్ అయినట్టైంది. మిజోరం, ఛత్తీష్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణకు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎన్నికల కమిషన్. మొత్తం నాలుగు దఫాలుగా పోలింగ్ చేపట్టింది. తొలి విడతలో నవంబర్ 7న మిజోరంతో పాటు.. ఛత్తీస్‌గఢ‌్ లో ఉన్న 17స్థానాలకు పోలింగ్ జరిగింది. ఫేజ్‌2లో నవంబర్ 17న మధ్యప్రదేశ్‌ మొత్తం సెంబ్లీ స్థానాలతో పాటు చత్తీస్‌గఢ్‌లో మిగిలిన నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించింది ఈసీ.

మూడో దశలో నవంబర్ 23న రాజస్థాన్, ఫేజ్ 4లో నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్మాత్మకంగా తీసుకున్న ఈసీ.. అక్కడక్కడ చదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా.. టాస్క్‌ను కంప్లీట్ చేసింది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికాన్నాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో.. ఇక అందరి దృష్ట్యంతా ఎగ్జిట్ పోల్స్‌పైనే పడింది. పోలింగ్ ముగిసిన అర్థగంట తర్వాత పబ్లిక్ ఓపెనియన్స్‌ను రిలీజ్ చేసుకోవచ్చని ఈసీ చెప్పడంతో ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసేందుకు ఆయా సర్వే సంస్థలు రెడీ అయ్యాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రాల వారిగా, పార్టీల వారిగా ప్రజాభిప్రాయం సేకరించిన సర్వే సంస్థలు తమ నివేదికలను వెల్లడించబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌ నేపథ్యంలో అటు పార్టీలతో పాటు ఇటు జనాల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

ఏ రాష్ట్ర్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ సర్వే సంస్థ ఏ పార్టీకి మెజార్టీ స్తానాలు కట్టబెట్టింది. పబ్లిక్ పల్స్ ఎలా ఉందని.. తెలుసుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఓటర్లు. సర్వేలో ఏ సంస్థ వెల్లడించిన నివేదికలు నిజం అవుతాయనే సస్సెన్స్ నెలకొంది.

ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో పబ్లిక్ మూడ్ ఎలా ఉంది. అధికారంలో ఉన్న ప్రభుత్వానికే ప్రజలు మరోసారి పట్టం కట్టబోతున్నారా లేక.. మార్పు కోరుకుంటున్నారా అని ప్రజాభిప్రాయాన్ని సేకరించారు సర్వే సంస్థలు. వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించి వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా నివేదికను సిద్ధం చేశాయి. ఐతే సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ వందకు వంద శాతం నిజం కావాలని ఏం లేదు. అలాగని పూర్తిగా భిన్నంగా ఉంటాయని కూడా చెప్పలేం. ఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుందని ఖచ్చితంగా చెప్పలేకపోయినా.. ప్రజల ఇంట్రెస్ట్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఫలితాల ట్రెండ్ ఎలా ఉండబోతోంది అనే అవగాహన అయితే కలుగుతుంది.

గతంలో చాలా సంస్థలు వాస్తవ ఫలితాలకు భిన్నంగా ఇచ్చిన ఘటనలు ఉన్నాయి. అలాగని అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పు అని కూడా చెప్పలేం. కొన్ని సర్వే సంస్థలు ఇచ్చిన నివేదికలకు.. కొంచెం అటు ఇటుగా ఫలితాలను వెల్లడించిన సర్వే సంస్థలు కూడా ఉన్నాయి.

ఏదేమైనా..గత కొన్ని ఏళ్లుగా దేశంలో ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఎన్నికలు ముగిసిన వెంటనే.. సర్వే సంస్థలు తమ నివేదికలను వెల్లడిస్తున్నాయి. జనాలు కూడా ఎగ్జిట్ పోల్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తుడటంతో.. ఆ ట్రెండ్ అలా కొనసాగుతోంది. కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కానుండడంతో.. అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. హోరా హోరీగా జరిగిన అసెంబ్లీ ఫైట్‌లో ఏ పార్టీ మెజార్టీ సాధించబోతోంది. ప్రజలు పూర్తి స్థాయి మెజారిటీ ఇచ్చారా లేక హంగ్ తప్పదా అనే సస్పెన్స్ క్రియేట్ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories