TS Electricity Usage: తెలంగాణలో రికార్డు స్థాయి లో విద్యుత్ వినియోగం...

Telangana Electricity Usage Records Break and More Usage in Hyderabad | Summer more Electricity Usage
x

TS Electricity Usage: తెలంగాణలో రికార్డు స్థాయి లో విద్యుత్ వినియోగం...

Highlights

TS Electricity Usage: గ్రేటర్ హైదరాబాద్‌లో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం...

TS Electricity Usage: తెలంగాణలో మరోసారి విద్యుత్ వాడకంలో రికార్డు తిరగ రాసింది. ప్రత్యేక రాష్ర్టం ఏర్పడిన తర్వాత విద్యుత్ వినియోగంలో పీక్ డిమాండ్ అధిగమించినట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఓ వైపు సాగునీటి ప్రాజెక్టుల వద్ద విద్యుత్ వినియోగం పెరగడం.. మరో వైపు మార్చి నెలలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యుత్ వినియోగం అధికమైనట్లు చెబుతున్నారు. వాణిజ్య, గృహ విద్యుత్ వినియోగం భారీగా పెరిగినప్పటికీ.. నిరంత రాయంగా విద్యుత్ సరఫరా చేస్తామనంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు.

మార్చి నెలలోనే అత్యధికంగా సోమవారం మధ్యాహ్నం సమయంలో 13 వేల 857 మెగావాట్ల విద్యుత్ వాడకం నమోదు అయ్యింది. గత మార్చి 31 న 13 వేల688 మెగావాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం నమోదు కాగా.. గత రికార్డ్స్ తిరగరాస్తూ ఏకంగా 13 వేల 857 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయ్యింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా విద్యుత్ వినియోగం పెరిగింది. గత ఏడాది హైదరాబాద్ లో 55 మిలియన్ యూనిట్స్ విద్యుత్ వినియోగం కాగా ఈ ఏడాది మార్చిలోనే 65 మిలియన్ యూనిట్లు డిమాండ్ పెరిగింది.

ప్రస్తుతం విద్యుత్ వినియోగం చూస్తుంటే ఏప్రిల్, మే మొదటి వారంలోనే అత్యధికంగా 14 వేల 500 మెగా వాట్ల పీక్ డిమాండ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇంత కంటే ఎక్కువగా 15 వేల మెగావాట్ల డిమాండ్ వచ్చిన సరఫరరాల ఎలాంటి ఇబ్బందులు కాకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు విద్యుత్ శాఖ సిద్దంగా ఉన్నట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో 11.34 శాతం వృద్ధి నమోదు కాగా ఏడాదికి వెయ్యి యూనిట్లకు పైగా తలసరి విద్యుత్ వినియోగం జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధికంగా 10 శాతం వృద్ధిరేటు సాధించి, ప్రథమ స్థానంలో నిలిచింది. 2017,-18 సంవత్సరంలో తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 1,727 యూనిట్లుంటే, 2018--19 నాటికి 1,896కి చేరింది.

దేశ వ్యాప్తంగా తలసరి విద్యుత్ వినియోగం 2.7 శాతం మాత్రమే వృద్ధి సాధించింది. 2017-18లో దేశ సగటు తలసరి విద్యుత్ వినియోగం ఒక వెయ్యి 149 యూనిట్లుంటే, 2019- 20లో ఒక వెయ్యి 181 యూనిట్లుగా నమోదయ్యింది. 2014 ఉమ్మడి ఏపీలో 13 వేల 162 మెగావాట్ల డిమాండ్ విద్యుత్ గరిష్ట డిమాండ్ వృద్ధి రేటులోనూ రాష్ట్రం గణనీయమైన వృద్ధి శాతం నమోదు చేసింది. 2016-17లో తెలంగాణలో 9 వేల 187 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదు కాగా, 2017-18 సంవత్సరంలో అది పది వేల 284 మెగావాట్లకు చేరింది.

2018-19లో తెలంగాణలో 10వేల 818 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదు కాగా, 2019,-20 సంవత్సరంలో 11 వేల 703 మెగావాట్లకు చేరింది. 28 ఫిబ్రవరి, 2021 మార్చి 31న ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో 13 వేల 688 మెగావాట్ల అధిక విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది మార్చి మొదటి వారం నుంచే పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తోంది..దీనితో ఈరోజు 13,857 మెగా వాట్లు నమోదు అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories