నేటితో తెలంగాణ ఎన్నికల ప్రచారం సమాప్తం.. సాయంత్రం 5 గంటలకు మూగబోనున్న మైకులు.. అమల్లోకి 144 సెక్షన్

Telangana Elections Campaign is over Today
x

నేటితో తెలంగాణ ఎన్నికల ప్రచారం సమాప్తం.. సాయంత్రం 5 గంటలకు మూగబోనున్న మైకులు.. అమల్లోకి 144 సెక్షన్

Highlights

TS Elections 2023: అతికొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంపై పార్టీల దృష్టి

TS Elections 2023: దాదాపు నెల రోజులపాటు హోరాహోరీగా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో ముగిసిపోనుంది. నేటి సాయంత్రం 5 గంటల్లోగా ప్రచారపర్వం పరిసమాప్తం కానుంది. రాజకీయ నాయకుల మైకులు, ప్రచార వాహనాలు, పార్టీల పాటలు ఎక్కడికక్కడ ఆగిపోనున్నాయి. ఈసీ నిబంధనల ప్రకారం పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. దీంతో తెలంగాణ పోలింగ్ గురువారం జరగనుండడంతో ఇవాళ సాయంత్రం ప్రచారం ముగించాల్సి ఉంటుంది. దీంతో మిగిలిన అతికొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.

ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. 48 గంటల పాటు మద్యం దుకాణాలను మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. మంగళవారం సాయంత్రం నుంచి పోలింగ్ ముగిసే సమయం వరకు ఎలాంటి ప్రచారానికి వీలుండదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు తెలంగాణ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. స్వస్థలాలకు వెళ్లాల్సి ఉంటుంది. టీవీలు, సోషల్ మీడియాలో కూడా ప్రకటనలు ఇవ్వకూడదు. ఇదిలా ఉంటే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు తమ చివరి ప్రయత్నాలను మొదలుపెట్టాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories