TS Polling: కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు

Telangana Election 2023 Voting Day Live Updates
x

TS Polling: కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు 

Highlights

TS Polling: రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాల మోహరింపు

TS Polling: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలింగ్‌కు భారీగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. పోలీసుల నిఘా నీడలో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. లక్షమంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నాయి.

సమస్యాత్మక ప్రాంతాలతోపాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. 375 కంపెనీల కేంద్ర బలగాలు తెలంగాణ ఎన్నికల విధుల్లో ఉన్నాయి. 4 వేల 400 సమస్యాత్మక ప్రాంతాలకు అదనంగా సిబ్బందిని కేటాయించారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండిస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్, ఇండో టెబిటన్ బార్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ భద్రతా విధుల్లో ఉండగా పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లను భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు.

65 వేల మంది తెలంగాణ పోలీసులు, 18 వేల మంది హోంగార్డులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఇప్పటికే మావోయిస్టు పార్టీ ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చింది. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. డిసెంబర్ 3న ఓట్ల కౌంటింగ్ జరుగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories