Free Electricity: 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంపై గుడ్ న్యూస్ వినిపించిన డిప్యూటీ సీఎం భట్టి

Free Electricity: 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంపై గుడ్ న్యూస్ వినిపించిన డిప్యూటీ సీఎం భట్టి
x

Free Electricity: 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంపై గుడ్ న్యూస్ వినిపించిన డిప్యూటీ సీఎం భట్టి

Highlights

Free Electricity scheme in Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మకమైన గృహ జ్యోతి పథకం గురించి డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Free Electricity scheme in Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మకమైన గృహ జ్యోతి పథకం గురించి డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గృహ జ్యోతి స్కీమ్ లబ్ధిదారుల గురించి ఆయన మాట్లాడుతూ ఈ స్కీం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్నారు. గతంలో ఎవరైతే గృహ జ్యోతి స్కీంకు దరఖాస్తు చేసుకోలేదో వారు మండల కార్యాలయాల్లోనూ, పట్టన డివిజన్ ఆఫీసుల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ఇదిలా ఉంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహ జ్యోతి స్కీం కింద 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటును అందిస్తున్నారు. నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనమండలిలో ఓ ప్రశ్నకు జవాబు ఇస్తూ గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ ఎవరైతే గృహ జ్యోతి స్కీంలో దరఖాస్తు చేసుకోలేదో వారంతా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతుందని విక్రమార్క పేర్కొన్నారు. 200 యూనిట్ల లోపు ఎవరైతే విద్యుత్ వినియోగం చేస్తున్నారో వారికి జీరో బిల్లులు ఇస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో సందర్భంలో ఆరు గ్యారంటీల హామీలను ప్రకటించింది. ఇందులో భాగంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. దీంతోపాటు గృహ జ్యోతి స్కీమ్ ను కూడా ప్రారంభించారు. అయితే ఈ స్కీం కింద లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం నెలకొంది. దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

చాలా గ్రామాల్లో గృహ జ్యోతి పథకం లబ్ధిదారుల విషయంలో గందరగోళం నెలకొని ఉంది. దీనిపై విద్యుత్ శాఖ అధికారులతోనూ స్థానికంగా ఉన్న గ్రామపంచాయతీలు, మునిసిపాలిటీలను సమన్వయం చేసుకొని లబ్ధిదారులకు గృహజ్యోతి పథకం అందజేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పలు గ్రామాల్లో అర్హులైన వారికి కూడా ఈ పథకం లభించలేదని ఫిర్యాదులు పెద్ద ఎత్తున అందుతున్నాయి. ఇదిలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో గృహజ్యోతి పథకం లబ్ధిదారులను గ్రామసభల ద్వారా ఎంపిక చేసామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అయితే ఈ స్కీం కింద భవిష్యత్తులో మరింత మంది లబ్ధిదారులను గుర్తిస్తామని ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం గతంలో గృహ జ్యోతి స్కీం కింద తలెత్తిన సమస్యలపై రివ్యూ మీటింగ్ కూడా జరిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే గృహ జ్యోతి స్కీం లబ్దిదారుల విషయంలో కీలక మార్గదర్శకాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories