Telangana Temples : తిరుమల ఘటనతో తెలంగాణ దేవాదాయ శాఖ అలర్ట్.. ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు

Telangana Debt Department Alert Laddu prasadas with Vijaya dairy ghee in main temples
x

Telangana Temples : తిరుమల ఘటనతో తెలంగాణ దేవాదాయ శాఖ అలర్ట్.. ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు

Highlights

Telangana Temples: తిరుమల ఘటనతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యినే వాడాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కరీంనగర్ లోని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయల్లో విజయ డెయిరీ నెయ్యిని ప్రసాదాల తయారీకి వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Telangana Temples: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తుల్లో ఆందోళన మొదలైంది. దేవాలయాల్లో లడ్డూ అంటేనే భక్తులు భయపడుతున్నారు. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో విజయ డెయిరీ నెయ్యినే వాడాలంటూ ఆదేశాలు జారీ చేసింది.అందుకు అనుగుణంగా కరీంగనర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి దేవాలయాలకు విజయ డెయిరీ నెయ్యిని చేరవేసింది. విజయ నెయ్యితోనే లడ్డూ ప్రసాదం తయారు చేసి భక్తులకు ప్రసాదంగా అందించే పనిలో అధికార యంత్రంగం నిమగ్నమై ఉంది.

ఉమ్మడి జిల్లాల్లోని ప్రముఖ ఆలయాల్లో లడ్డూ, పులిహోర ప్రసాదాలను భక్తులు ఎంతో పవిత్రంగా భావించి కొనుగోలు చేస్తుంటారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో తప్పిదం జరిగిందన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయశాఖ అలర్ట్ అయ్యింది. ప్రధాన ఆలయాల్లో తాజా ఉత్తర్వులను తప్పకుండా పాటించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యిని మాత్రమే వాడాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకాలం వాడిన కరీంనగర్ డెయిరీ నెయ్యిని బంద్ చేసి విజయ డెయిరీ నెయ్యి కంటే కిలో 12రూపాయలు విజయ డెయిరీ నెయ్యి తక్కువకు లభిస్తుండటంతో ప్రభుత్వం నిర్ణయం ఆలయాలకు ఖర్చు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

కాగా వేములవాడ రాజన్నను దర్శించుకునే భక్తులు ప్రత్యేకంగా స్వామివారి ప్రసాదం లడ్డూలను మహాప్రసాదం భావించి కొనుగోలు చేస్తుంటారు. లడ్డూల తయారీని ఏఈవో, పర్యవేక్షకుడు, సిబ్బంది చెక్ చేస్తారు. భక్తుల రద్దీ అంచనాతో లడ్డూలను తయారు చేస్తుంటారు. దాదాపు ప్రతినెల 10 నుంచి 15వేల కిలోల నెయ్యిని లడ్డూల తయారీకి వినియోగిస్తుంటారు. ఆలయానికి ఏడాదికి రూ. 20కోట్ల ఆదాయం లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా వినియోగించాల్సి ఉంటుంది. ఆలయానికి సరఫరా అయ్యేనెయ్యికి ఆరు నెలల కాలపరిమితి ఉంటుంది. దానికి అనుగుణంగానే నాణ్యమైన నెయ్యిని లడ్డూల తయారీలో వినియోగిస్తున్నామని ఏఈవో శ్రీనివాస్ వెల్లడించారు.

అటు ధర్మపురిలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం లడ్డూ ప్రత్యేకంగా నిలుస్తోంది. 80గ్రామల లడ్డూ ప్రసాదానికి రూ. 20 200గ్రాముల పులిహోర ప్రసాదానికి రూ. 15 చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిరోజు 3 నుంచి 5వేల వరకు లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తుంటారు. అటు కొండగట్టలో ప్రతిఏటా 50వేల కిలోల నెయ్యిని వినియోగిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories