యాత్ర అదే పాత్రలే మారుతున్నాయ్.. టీ కాంగ్‌లో టెన్షన్

యాత్ర అదే పాత్రలే మారుతున్నాయ్.. టీ కాంగ్‌లో టెన్షన్
x
Highlights

రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభిస్తే.. భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి కూడా పాదయాత్రలు తలెపెట్టారు. పోటాపోటీగా యాత్రలు చేస్తున్నారనేది ఆకస్తికరంగా మారింది.

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కేడర్‌లో జోష్‌ నింపేందుకు సిద్ధమయ్యారు. ఒకరి తర్వాత మరొకరు పోటీ పడి మరీ పాదయాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే అచ్చంపేటనుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభిస్తే.. భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి కూడా పాదయాత్రలు తలెపెట్టారు. వీరంతా ఎందుకింత హడావిడిగా, పోటాపోటీగా యాత్రలు చేస్తున్నారనేది ఆకస్తికరంగా మారింది.

కాంగ్రెస్‌ ఎంపీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యవ‌హారశైలి ఎప్పుడు దూకుడుగానే ఉంటుంది. రాజకీయంగా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు రేవంత్ అకస్మాత్తుగా పాదయాత్ర చేయడం ఆపార్టీ ముఖ్యనేత‌ల‌ను ఆలోచ‌న‌లో ప‌డేసింది. ఈనెల7న అచ్చంపేట‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ వేదిక మీద నుంచి నేరుగా పాద‌యాత్రను అనౌన్స్ చేసి.. పాదయాత్ర స్టార్ట్ చేశారు. రేవంత్ పాద‌యాత్ర కాక‌తాలీయంగా జ‌రిగిందా... వ్యూహాత్మకంగానే ప్రక‌టించారా..అనేది చర్చనీయాంశం అయింది. పిసిసి పీఠం ఆశించిన రేవంత్ రెడ్డి బహిరంగంగా ఎక్కడ బయట పడకుండానే పావులు కదిపారు. ఇప్పుడు రైతు సమస్యలపై కేంద్ర ఏఐసిసి పిలుపు మేరకు ముందుకు సాగుతున్నా అంటున్నారు.

రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అనూహ్యమైన రీతిలో పాదయాత్ర మొదలుపెట్టారు. అచ్చంపేటలో రాజీవ్‌‌‌‌‌‌‌‌ రైతు భరోసా దీక్ష పేరిట ఏర్పాటు చేసారు. తన స్వంత ప్రాంతమైన అచ్చపేటలో సభలో పాల్గొన్న రేవంత్ ..తర్వాత దాన్ని పాదయాత్రగా మార్చారు. సభలో పాల్గొన్న జనం, స్టేజీపై ఉన్న లీడర్ల కోరిక మేరకు ఆయన అప్పటికప్పుడు టూర్ మొదలుపెట్టారు. తొలిరోజు తొమ్మిది కిలోమీటర్లు, రెండో రోజైన సోమవారం 11 కిలోమీటర్లు నడిచారు. 8 రోజుల పాటు సాగే యాత్ర చివరగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ చేరుకోనుంది.

మరో సీనియర్ నేత భట్టి విక్రమార్క్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం తలపెట్టారు. అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే ప్రతిపక్ష నేతగా, సీఎల్పీ లీడర్‌‌‌‌‌‌‌‌గా ప్రజా సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో యాత్రలు చేపడతానని భట్టి విక్రమార్క చెప్పారు. గతంలో కరోనా ప్రబలిన సమయంలో రాష్ట్రంలోని హాస్పిటళ్ల పరిస్థితిపై ఆయన యాత్ర చేశారు. కరోనా ఏర్పాట్లపై పర్యటించారు. తాజాగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు రైతులతో ముఖాముఖి కార్యక్రమం ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. పది రోజుల క్రితమే దీనికి సంబంధించిన షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ విడుదల చేశారు. ఈ నెల 9 నుంచి 21వ తేదీ వరకు పర్యటన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా భీంసార్‌‌‌‌‌‌‌‌ గ్రామం నుంచి పాత ఖమ్మం జిల్లా మధిర వరకు యాత్ర నిర్వహించి రైతుల కష్ట సుఖాలను తెలుసుకోవాలని నిర్ణయించారు. 11 కొత్త జిల్లాల మీదుగా ఆయన యాత్ర సాగుతుంది.

రైతుల కోసం పాదయాత్ర చేస్తానని చాలా రోజులుగా అంటున్న జగ్గారెడ్డి ఈ నెల 10వ తేదీన ముహూర్తం పెట్టుకున్నారు. సదాశివపేట నుంచి సంగారెడ్డి, పటాన్‌‌‌‌‌‌‌‌చెరు, గచ్చిబౌలి, పంజాగుట్టల మీదుగా ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌ వచ్చేందుకు జగ్గారెడ్డి ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్కలతో పాటు మరికొంతమంది నేతలు కూడా పాదయాత్రలకు రెడీగా ఉన్నట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏమి పట్టనట్లు ఉండడంతో ఎవరికి వారే ఎమునా తీరే అన్నట్లు ఉంది కాంగ్రెస్ నేతల వ్యవహారం.

Show Full Article
Print Article
Next Story
More Stories