Congress: ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

Telangana Congress Leaders Going to Delhi
x

ఢిల్లీకి వెళ్లిన కాంగ్రెస్ నాయలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Congress: ఇవాళ రాహుల్‌తో టీకాంగ్రెస్ నేతల కీలక సమావేశం * తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులపై ప్రధాన చర్చ

Congress: తెలంగాణ కాంగ్రెస్ నేతలు హస్తిన బాట పట్టారు. రాహుల్‌ గాంధీ నుంచి కబురు రావడంతో ఢిల్లీకి వెళ్లారు. కొత్త పీసీసీ ఏర్పాటైన చాలా రోజుల తర్వాత అధినేత అపాయింట్‌మెంట్‌ దొరకడంతో పీసీసీ టీమ్ ఢిల్లీకి వెళ్లింది. మధ్యాహ్నం తర్వాత రేవంత్‌ రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు.

కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి రావాలని అధిష్టానం నుంచి పిలుపు రావడంతో.. హడావుడిగా ఢిల్లీకి వెళ్లారు.. వీరిలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఐదుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లతో పాటు కమిటీ ఛైర్మన్‌లు ఉన్నారు. అయితే.. ఒక్కో నాయకుడితో రాహుల్‌ గాంధీ వ్యక్తిగతంగా మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రజా సమస్యలపై ఆందోళనలు, పార్టీ పటిష్టం కోసం కార్యచరణపై నేతలతో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

పీసీసీ చీఫ్ నియామకానికి ముందు పార్టీ ముఖ్యనాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికీ కొందరు అడపా దడపా కామెంట్స్‌ చేస్తూనే ఉన్నారు. దీంతో అందరి అభిప్రాయాలు తీసుకోవడం, వారికి రాహుల్‌ సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తితో ఉన్న నాయకులతోనూ ఫోన్‌లో మాట్లాడే అవకాశం ఉంది.. ఇక తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దళిత గిరిజన దండోరా ముగింపు సభకు అధినేతను ఆహ్వానించాలని ఆలోచిస్తోంది. మొత్తానికి ఇవాళ్టి సమావేశంలో ఎవరు? ఎవరిపై? ఫిర్యాదు చేసుకుంటారో అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories