Congress: కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం ఈమెకే..! సీఎంగా రేవంత్ సంతకం..

Telangana Congress Gave First Job To Physically Challenged Woman Rajini In Hyderabad
x

Congress: కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం ఈమెకే..! సీఎంగా రేవంత్ సంతకం..

Highlights

Congress: ప్రభుత్వంలోకి రాగానే ఉద్యోగమిస్తామని గ్యారెంటీ కార్డు రాసిచ్చిన రేవంత్‌

Congress: తెలంగాణలో తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని మేనిఫెస్టోలో తెలిపింది కాంగ్రెస్. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తొలిరోజే ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు రేవంత్ రెడ్డి. అక్టోబర్‌లో రేవంత్ రెడ్డిని కలిసిన రజిని.. తనకు ఎవరూ ఉద్యోగం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను పీజీ చదివినా ఉద్యోగం రావడం లేదని చెప్పింది. దాంతో డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. రాగానే ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. అదే రోజున రజినీకి గ్యారెంటీ కార్డు కూడా రాసిచ్చారు. తాను ఇచ్చిన హామీ మేరకు రేపు ప్రమాణస్వీకారోత్సవం అనంతరం ప్రభుత్వంలో తొలి ఉద్యోగం రజినికి ఇవ్వనున్నారు రేవంత్ రెడ్డి.



Show Full Article
Print Article
Next Story
More Stories