Congress: పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ దృష్టి

Telangana Congress Focus On Parliament Elections
x

Congress: పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ దృష్టి

Highlights

Congress: విద్యుత్, ఇరిగేషన్, ఆర్థికస్థితిపై అసెంబ్లీలో 3రోజుల పాటు చర్చ

Congress: అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. గాంధీభవన్‌లో జరిగిన PAC మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్లమెంట్ నియజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించారు. చేవెళ్ల, మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానాల బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించారు. అలాగే పొంగులేటికి ఖమ్మం, ఉత్తమ్‌కి నల్గొండ, పొన్నంకి కరీంనగర్ స్థానాన్ని అప్పగించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని పీఏసీలో తీర్మానం చేశారు నేతలు. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ బాధ్యతను అధిష్టానానికి అప్పగించారు రేవంత్ రెడ్డి. ఎల్లుండి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్, ఇరిగేషన్, ఆర్థికస్థితిపై 3రోజుల పాటు చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories