Revanth Reddy Speech: వారంతా కూడా ఈ 'ఉనిక' పుస్తకం చదవాలి - రేవంత్ రెడ్డి

Revanth Reddy speech about former governor Ch Vidyasagar Rao
x

Revanth Reddy Speech: వారంతా కూడా ఈ ఉనిక పుస్తకం చదవాలి - రేవంత్ రెడ్డి

Highlights

Former governor Ch Vidyasagar Rao's Unika book launch event: పార్టీ ఫిరాయింపులపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. విద్యాసాగర్ రావు రచించిన ఉనిక పుస్తకం చదవాలని ఆయన సూచించారు.

Revanth Reddy speech about former governor Ch Vidyasagar Rao: తెలంగాణ లాంటి అత్యంత రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రానికి, అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉన్న మహారాష్ట్రకు గవర్నర్ కేంద్రం నియమించిందంటే అది విద్యాసాగర్ రావుపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ గవర్నర్, బీజేపి అగ్రనేత చెన్నమనేని విద్యాసాగర్ రావు రచించిన స్వీయచరిత్ర 'ఉనిక' పుస్తకాన్ని ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించిన సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. "5 దశాబ్ధాల రాజకీయ జీవితంలో ఎలాంటి వివాదాలు, అవినీతి ఆరోపణలు లేని నాయకుడు విద్యాసాగర్ రావు" అని ఆయన ప్రశంసించారు.

సిద్ధాంతాల పరంగా, పార్టీల పరంగా ఎవరైనా ఆయనతో విభేదించి ఉంటే ఉండవచ్చు గానీ వ్యక్తిగతంగా విద్యాసాగర్ రావును విమర్శించిన వారు ఎవ్వరూ లేరని అన్నారు. ఒక్కసారి కౌన్సిలర్ గానో లేక కార్పొరేటర్ గానో ఎన్నికైతే చాలు వారి పదవీ కాలం పూర్తయ్యేసరికి వారిపై వచ్చే అవినీతి ఆరోపణలతో ఒక పుస్తకం రాయొచ్చన్నారు. కానీ ఎలాంటి మచ్చలేకుండా ఎన్నో పదవుల్లో కొనసాగిన అరుదైన నాయకుడు విద్యాసాగర్ రావు అని అన్నారు. ఆయన తెలంగాణ సమాజానికి ఆదర్శం అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

వారంతా ఈ 'ఉనిక' పుస్తకం చదవాల్సిన అవసరం ఉందన్న రేవంత్ రెడ్డి

"ఒక దశలో ఉస్మానియా యూనివర్శిటీ వేదికగా ఓవైపు జార్జి రెడ్డి, మరోవైపు విద్యాసాగర్ రావు విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. విద్యార్థి దశ నుండే తాము నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన నాయకుడు విద్యాసాగర్ రావు. పదవుల కోసమో లేక అధికారం కోసం పార్టీలు మారలేదు. కానీ ఇప్పుడున్న నాయకులు అధికారం కోసం, పదవుల కోసమో పార్టీలు మారుతున్నారు. వారు అలా మారడానికి కారణం వారు విద్యార్థి దశలో రాజకీయాలపై అవగాహన లేకపోవడమే" అని రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో విలువలు పాటిస్తూ ఎదగాలని కోరుకునే ప్రతీ ఒక్కరూ విద్యార్ధి దశ నుండి రాజకీయాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు విద్యాసాగర్ రావు రచించిన ఉనిక పుస్తకం చదవాలని ఆయన సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories