Revanth Reddy: హరిత తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి అలుపెరగని కృషి.. సాహసోపేత నిర్ణయాలు..!

Revanth Reddy: హరిత తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి అలుపెరగని కృషి.. సాహసోపేత నిర్ణయాలు..!
x

Revanth Reddy: హరిత తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి అలుపెరగని కృషి.. సాహసోపేత నిర్ణయాలు..!

Highlights

Revanth Reddy: వాతావరణ మార్పు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు సవాలుగా మారుతున్నాయి.

Revanth Reddy: వాతావరణ మార్పు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు సవాలుగా మారుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాలుచేపడుతున్నారు. సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న కార్యక్రమాలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి.

రాష్ట్రంలోని 75 సరస్సుల పునరుద్ధరించాలని కాంగ్రెస్ సర్కార్ ప్లాన్. రాష్ట్రంలో 2,000 సరస్సుల పనులు కొనసాగుతున్నాయి. నిర్జీవమైన నీటి వనరులను పునరుద్దరించారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ సంస్కరణల ద్వారా జీవవైవిద్యాన్ని మెరుగుపరచడం, భూగర్భ జలాలను పెంపు కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా రాష్ట్రానికి రాకుండా పోయిన వలస పక్షులను తిరిగి తెలంగాణకు తీసుకురావడంలో హైడ్రా ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే సంస్కరణలు చేపట్టి పునరుద్దరించిన సరస్సులకు ఫ్లెమింగోలు, ఫ్లెక్యాచర్‌ల వంటి జాతులు తిరిగి వస్తున్నాయి. పర్యావరణ పునరుద్దరణ ప్రకృతికి, మానవాళికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో వివరిస్తుంది. హైదరాబాద్‌లోని అమీన్‌పూర్ సరస్సు వద్ద అరుదైన ఎర్రటి ఫ్లెక్యాచర్‌లపై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన ట్వీట్ పర్యావరణ పునరుద్దరణ కోసం కొనసాగుతున్న కార్యక్రమాల గురించి తెలుపుతుంది.

EV వాహనాలు, కాలుష్య నియంత్రణ

ప్రజా రవాణాలో విద్యుత్ వాహనాలను తెలంగాణ ప్రభుత్వం ఎక్కువగా వినియోగిస్తోంది. కాలుష్య కారక డీజిల్ బస్సుల స్థానంలో బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలతో ప్రభుత్వం పట్టణ, వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించింది. . రేవంత్ ఆలోచనలు, అధికారుల పనితీరుతో హైదరాబాద్ మోడల్ గ్రీన్ సిటీగా మారనుంది.

పట్టణ పచ్చదనం

పట్టణ, ప్రాంతాల్లో విస్తరించిన అటవీ అభివృద్ది కోసం చేసిన కార్యక్రమాలు ఫలితాన్ని ఇచ్చాయి. విపరీతమైన వాతావరణ పరిస్థితులను తట్టకునేలా హైదరాబాద్‌ను సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఈ ప్రయత్నాలకు నడుం బిగించింది కాంగ్రెస్ సర్కార్. హీట్ వేవ్ మిటిగేషన్ ప్లాన్‌ల నుంచి అర్బన్ స్ట్రామ్ వాటర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ల వరకు, వాతావరణ అనుకూల పద్దతులతో రాష్ట్రం తన ప్రత్యేకతను చాటుకోనుంది.

వాటర్ హార్వెస్టింగ్..

నికర-జీరో ఉద్గారాల గృహ సముదాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం గేమ్ ఛేంజర్. ఈ స్థిరమైన ప్రాజెక్టులు పునరుత్పాదక శక్తి, సమర్థవవంతమైన వ్యర్థాల నిర్వహణ, నీటి సంరక్షణ సాంకేతికతలను ఏకీకృతం చేస్తాయి. ఇవి కనీస పర్యావరణ ప్రభావాన్ని నిర్థారిస్తాయి. అదనంగా స్థిరమైన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాలు నీటి కొరతను పరిష్కరిస్తున్నాయి.

సౌర శక్తి

తెలంగాణ ఎనర్జీ గ్రిడ్‌లో సోలార్ ప్లాంట్‌ల అనుసంధానం కర్బన ఉద్గారాలను తగ్గించడంలో ప్రభుత్వం నిబద్దతను చెబుతోంది. పునరుత్వాదక ఇందన వనరులపై సర్కార్ దృష్టి పెట్టడం ద్వారా భవిష్యత్త్ తరాలకు ఇంధన భద్రతకు భరోసా కల్పిస్తోంది.

ఎకో-టూరిజం

బాపూ ఘాట్ వంటి గాంధేయ యాత్ర స్థలాలను పర్యావరణ-పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టులు సుస్థిరతను, పర్యావరణ బాధ్యతతో సాంస్కృతిక వారసత్వాన్ని మిళితం చేస్తాయి.

పట్టణ కాలుష్యం తగ్గించడం

పొడి, తడి చెత్త విభజన, రీసైక్లింగ్ వంటి వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థలను తెలంగాణ అమలు చేసింది. ఈ చర్యల వల్ల ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పట్టణ కాలుష్యాన్ని తగ్గిస్తున్నారు.

భారతదేశ భవిష్యత్తుకు ఒక నమూనా

వాతావరణ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానం తెలంగాణకు మాత్రమే కాదు.. దేశానికే ఆదర్శం. పర్యావరణ పునరుద్దరణ, స్థిరమైన పట్టణ ప్రణాళికలు, ఆర్థిక వృద్ధి, పర్యావరణ పరిరక్షణ కలిసికట్టుగా సాగుతుందని నిరూపిస్తుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ దూరదృష్టితో కూడిన పాలన వాతావరణ సవాళ్లను అవకాశాలుగా మార్చగలదని రుజువు చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories