Beer Price: మద్యం ప్రియులకు షాక్.. రాష్ట్రంలో బీర్ల ధరలు భారీగా పెంపు.. కేఎఫ్ బీర్లు బంద్

Beer Price: మద్యం ప్రియులకు షాక్.. రాష్ట్రంలో బీర్ల ధరలు భారీగా పెంపు.. కేఎఫ్ బీర్లు బంద్
x
Highlights

Beer Price: మద్యం ప్రియులకు బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో బీర్ల ధరను భారీగా పెంచింది. కింగ్ ఫిషర్ బీర్ల రేట్లు పెంపుపై ముఖ్యమంత్రి...

Beer Price: మద్యం ప్రియులకు బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో బీర్ల ధరను భారీగా పెంచింది. కింగ్ ఫిషర్ బీర్ల రేట్లు పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మద్యం సరఫరా కోసం ముందుకు వచ్చే కంపెనీల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం టీజీపీసీఎల్ కు సరఫరా చేస్తున్న కంపెనీలతోపాటు, కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానాలను అనుసరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

కంపెనీల ఎంపికకు సీఎం కొన్ని కీలక మార్గదర్శకాలు చేశారు. కొత్త కంపెనీల అనుమతుల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలిపారు. కనీసం ఒక నెల గడవు ఇవ్వాలని వారికి సూచించారు. దరఖాస్తు చేసుకునే కంపెనీల బ్రాండ్ల నాణ్యత, సరఫరా సామర్ధ్యాలను కచ్చితంగా పరిశీలించాలని సీఎం ఆదేశించారు.

ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, ఎక్సైజ్ కమిషనర్ హరికిషన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అధికారులు ఇటీవల యునైటెడ్ బేవరేజెస్ కంపెనీ బీర్ల ధరలను 33.1% పెంచాలని ఒత్తిడి తీసుకు వచ్చినట్లు సీఎంకు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఒత్తిడికి తలొగ్గేది లేదని సీఎం స్పష్టం చేశారు. ధరల విషయంలో ఏపీ, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలతో పోలిక చేయాలని అధికారులకు సూచించారు.

ధరల పెంపు నిర్ణయం తీసుకుని బాధ్యత హైకోర్టు డ్ జడ్జి నేతృత్వంలో నిర్ణయ కమిటీ నివేదిక ఆధారంగా ఉండాలని తెలిపారు. గత ఏడాది నుంచి ఎక్సైజ్ శాఖకు బిల్లును చెల్లిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న బకాయిలను క్రమంగా క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలు సరఫరా ప్రక్రియలో పారదర్శకత్వం పెంచి నాణ్యమైన సేవలు అందించడానికి మార్గదర్శకాలు చూపిస్తాయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories