నిరూపిస్తే నిమిషంలో రాజీనామా చేస్తా : కేసీఆర్

నిరూపిస్తే నిమిషంలో రాజీనామా చేస్తా : కేసీఆర్
x
Highlights

దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్రంలో పింఛనులలో రూ.1600లు కేంద్రమే ఇస్తున్నట్టు బీజేపీ నేతలు ప్రచారం చేయడం పట్ల సీఎం మండిపడ్డారు.

దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో పింఛనులలో రూ.1600లు కేంద్రమే ఇస్తున్నట్టు బీజేపీ నేతలు ప్రచారం చేయడం పట్ల సీఎం మండిపడ్డారు. రాష్ట్రంలో 38,64,751 మందికి ఒక్కొక్కరికి రూ.2016 చొప్పున పింఛన్లు ఇస్తున్నామని అన్న కేసీఆర్ కేంద్రం తరఫున 6,95,000 మందికి రూ.200ల చొప్పున మాత్రమే ఇస్తోందన్నారు. ఇక ఏడాదికి తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల కోసం రూ.11వేలకోట్లు ఖర్చు చేస్తే, కేంద్రం కేవలం రూ.105 కోట్లు మాత్రమే ఇస్తోందని చెప్పుకొచ్చారు.

కానీ బీజేపీ నేతలు మాత్రం పింఛనులో రూ.1600లు కేంద్రమే ఇస్తున్నట్టు అసత్యపు ప్రచారాలు చేయడం దారుణమని మండిపడ్డారు. ఒకవేళ తానూ చెప్పిన మాటలు అబద్దాలు అని ఎవరైనా నిరూపిస్తే ముఖ్యమంత్రి పదవికి నిమిషంలో రాజీనామా చేస్తానని సీఎం సవాల్ విసిరారు.ఇక దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ దే ఘనవిజయం అని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. శనివారం జనగామ జిల్లాలోని కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభించిన సందర్భంగా ఈ వాఖ్యలు చేశారు కేసీఆర్..

ఇక ప్రపంచంలోనే రైతులకి ఎక్కడ కూడా రైతు వేదికలు లేవని అన్నారు. కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభించి చరిత్ర సృష్టించామని అన్నారు. వ్యవసాయ రంగంలో ఇదో సరికొత్త అధ్యాయమనిఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 2400క్లస్టర్ లలో రైతు వేదికలు ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories