కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన సీఎం కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన సీఎం కేసీఆర్
x
Highlights

ప్రగతిభవన్‌లో 2020-2021 బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ మధ్యంతర సమీక్ష నిర్వహించారు. కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టం, కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, సవరించుకోవాల్సిన అంశాలపై ఆర్థికశాఖ అధికారులతో చర్చించారు.

ప్రగతిభవన్‌లో 2020-2021 బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ మధ్యంతర సమీక్ష నిర్వహించారు. కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టం, కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, సవరించుకోవాల్సిన అంశాలపై ఆర్థికశాఖ అధికారులతో చర్చించారు. సీఎస్‌తో పాటు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, అర్థికశాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. సమీక్షలో ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టం ప్రస్తావనకు వచ్చింది. వరదల కారణంగా రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క నయాపైసా కూడా సాయం అందలేదని ఆర్థిక శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

మరోవైపు వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5వేల కోట్ల వరకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసి, 13 వందల 50 కోట్ల రూపాయలను తక్షణ సాయంగా అందించాలని సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అక్టోబర్ 15న లేఖ రాశారు. కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి, పరిస్థితిని సమీక్షించింది. ఇంత జరిగిన తర్వాత కూడా కేంద్రం నుంచి ఎంతో కొంత సాయం అందుతుందని ఆశించామని, అయితే కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా సాయం అందలేదని ఆర్థిక శాఖ సమీక్షలో అధికారులు తెలిపారు.

దీనిపై స్పందించిన కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వానివి శుష్క ప్రియాలు, శూన్య హస్తాలే అన్న విషయం మరోసారి రుజువైందని వ్యాఖ్యానించారు. వరదల వల్ల భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం జరిగినా ఒక్క రూపాయి కూడా సాయం అందించకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేస్తుందని విమర్శించారు. దేశంలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరానికి నష్టం జరిగితే కూడా స్పందించి సాయం చేయకపోవడం దారుణమన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories