Telangana Cabinet: జ‌న‌వ‌రి 4న తెలంగాణ కేబినెట్ స‌మావేశం.. రైతు భరోసా, రేషన్‌కార్డులపై చర్చ?

Telangana Cabinet Will Meet On January 4
x

Telangana Cabinet: జ‌న‌వ‌రి 4న తెలంగాణ కేబినెట్ స‌మావేశం.. రైతు భరోసా, రేషన్‌కార్డులపై చర్చ?

Highlights

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ సమావేశం జనవరి 4వ తేదీన సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది.

Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ సమావేశం జనవరి 4వ తేదీన సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో రైతు భరోసా, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం, కొత్త రేషన్ కార్డులు, ఎస్పీ వర్గీకరణ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దీంతో ఈ కేబినెట్ భేటీపై ఆయా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

సంక్రాంతి నుంచే రైతు భరోసా పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతు భరోసా ఎవరికి ఇవ్వాలన్న దానితో పాటు కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాల ఖరారుపై సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వ్యవసాయ యాంత్రీకరణ, వీఆర్వో వ్యవస్థ, భూ భారతి అమలు వంటి అంశాలపై కూడా చర్చించనున్నట్టుగా సమాచారం.

ఈ నెల 30న కేబినెట్ భేటీ జరగాల్సి ఉంది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి సంతాప దినాల్లో భాగంగా నివాళులర్పించేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. దీంతో కేబినెట్ భేటీ వాయిదా పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories