Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు

Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు
x
Highlights

Telangana Cabinet Meeting Today : తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. నాలుగు గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది....

Telangana Cabinet Meeting Today : తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. నాలుగు గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అంశాల్లో ముఖ్యమైనవి క్లుప్తంగా ఇలా ఉన్నాయి.

1) నాగోల్‌ నుండి ఎల్బీ నగర్‌ మీదుగా హయత్‌నగర్‌ వరకు మెట్రో రైలు మార్గం విస్తరణ.

2) ఎల్బీ నగర్‌ నుండి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ.

3) సమ్మక్క సారలమ్మ గిరిజన వర్సిటీకి 211 ఎకరాలు స్థలం కేటాయింపు.

4) ఏటూరునాగారంను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం.ఇవే కాకుండా ఇంకొన్ని ఇతర నిర్ణయాలను కూడా కేబినెట్ ఆమోదించింది.

ఎట్టకేలకు ముందడుగు

హైదరాబాద్ లో మెట్రో రైల్‌ మార్గాల విస్తరణకు ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తోంది. నగర శివారులో ఉన్న తమ ప్రాంతానికి మెట్రో విస్తరించాలనేది ఆయా ప్రాంతాల వాసుల డిమాండ్. నేతలు కూడా తరచుగా హామీలిస్తూ వస్తున్నారు.

ఇటీవలే ఎల్బీ నగర్ - హయత్ నగర్, ఎల్బీ నగర్ - శంషాబాద్ మార్గాలకు మెట్రో ప్రాజెక్టు విస్తరణ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ ప్రాంతంలో అప్పుడే కొంత మేరకు రియల్ ఎస్టేట్ బిజినెస్ పుంజుకున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా క్యాబినెట్ ఆమోదంతో ఆ రెండు మార్గాలలో మెట్రో విస్తరణకు ముందడుగు పడినట్లయింది.

మేడ్చల్ మెట్రో సాధన సమితి పోరాటం

జేబిఎస్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో ప్రాజెక్టును విస్తరించాలని ఆ ప్రాంతం వాసులు కూడా డిమాండ్ చేస్తున్నారు. పలు సందర్భాలలో మేడ్చల్ మెట్రో సాధన సమితి పలు నిరసనలు కూడా చేపట్టింది. ప్రభుత్వ పెద్దలకు, మెట్రో సంబంధిత ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేశారు. అయినప్పటికీ తమ ప్రాంతానికి మొండి చెయ్యి చూపించారని మేడ్చల్ మెట్రో సాధన సమితి నేతలు ఆందోళన చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories