తెలంగాణ కేబినెట్ విస్తరణ ఆలస్యం.. తమిళిసైకి పంటి నొప్పితో ప్రమాణ స్వీకారం క్యాన్సిల్

Telangana Cabinet Expansion
x

తెలంగాణ కేబినెట్ విస్తరణ ఆలస్యం.. తమిళిసైకి పంటి నొప్పితో ప్రమాణ స్వీకారం క్యాన్సిల్

Highlights

Telangana Cabinet: తమిళిసైకి పంటి నొప్పితో ప్రమాణ స్వీకారం క్యాన్సిల్

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ విస్తరణ ఆలస్యం కానుంది. బుధవారం ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే గవర్నర్ తమిళిసై సమయం ఇవ్వకపోవడంతో కార్యక్రమం శుక్రవారానికి వాయిదా పడింది. కేబినెట్‌లోకి పట్నం మహేందర్ రెడ్డి, గంప గోవర్దన్‌ను తీసుకుంటున్నట్లు ... ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వాలంటూ సీఎంవో నుంచి రాజ్‌ భవన్‌కు మంగళవారం నోట్ పంపించారు.

ముందుగా బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రమాణ స్వీకారానికి గవర్నర్ టైమ్ ఇచ్చి తర్వాత రద్దు చేశారు. తమిళిసై తీవ్ర పంటి నొప్పితో బాధ పడుతుండటంతో మంత్రుల ప్రమాణ స్వీకారం వాయిదా పడినట్లు తెలుస్తోంది. గవర్నర్ డెంటల్ చెకప్ కోసం హాస్పిటల్‌కు వెళ్లడం, ఇతర కారణాలతో టైమ్ ఇచ్చి క్యాన్సిల్ చేశారని తెలిసింది. అయితే గురువారం మంచి రోజు కాకపోవడంతో శుక్రవారం ప్రమాణ స్వీకారం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

తాండూరు నియోజకవర్గం నుంచి పట్నం మహేందర్ రెడ్డి పోటీ చేయాలని భావించారు. అయితే అక్కడి టికెట్ పైలట్ రోహిత్ రెడ్డికి ఇవ్వడంతో పట్నం మహేందర్‌రెడ్డి నిరాశలో పడ్డారు. అసంతృప్తితో ఉన్న పట్నం మహేందర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు పిలిపించి మాట్లాడారు. 2021 మే 2న ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. 25 నెలులగా మంత్రి బెర్త్ ఖాళీగానే ఉంది. ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాశ్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారని భావించారు.

బండ ప్రకాష్‌కు మండలి డిప్యూటీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఖాళీగా ఉన్న బెర్త్ ను పట్నం మహేందర్‌రెడ్డితో భర్తీ చేయాలనుకున్నారు. అయితే బీసీ స్థానాన్ని రెడ్డి సామాజిక వర్గంతో భర్తీ చేస్తే ఇబ్బందులు వస్తాయని వెనుకంజ వేశారు. సీఎం కేసీఆర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ , కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈటల స్థానంలో కామారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్దన్‌‌‌ను కేబినెట్‌లోకి తీసుకోనున్నారు. మహేందర్‌రెడ్డికి ఇచ్చిన మాట కోసం మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలలో ఒకరిని రాజీనామా చేయించనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories