Telangana Budget 2021: ఆర్టీసీకి అండగా నిలచిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Budget 2021: Government Allocated Rs 3,000 cr for TSRTC
x

Telangana Budget 2021: ఆర్టీసీకి అండగా నిలచిన తెలంగాణ ప్రభుత్వం

Highlights

Telangana Budget 2021: సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నఆర్టీసీకి ప్రభుత్వం అండగా నిలిచింది. బడ్జెట్‌లో ఏకంగా ఆర్టీసీ కోసం 3000 కోట్లు కేటాయించింది.

Telangana Budget 2021: సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నఆర్టీసీకి ప్రభుత్వం అండగా నిలిచింది. బడ్జెట్‌లో ఏకంగా ఆర్టీసీ కోసం 3000 కోట్లు కేటాయించింది. నిరాశలో ఉన్నఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపింది. గతేడాది కంటే అధిక నిధులను కేటాయించి ఉద్యోగులకు ఊరట కలిగించింది.

తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకోవడానికి ప్రభుత్వం అండగా నిలిచింది. బడ్జెట్‌లో గతేడాది కంటే అధిక నిధులు కేటాయించింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి తీవ్ర ఊరటను కలిగించింది. ఉద్యోగుల్లో ధైర్యాన్ని నింపింది. భవిష్యత్తుపై ఆశ కలిగించింది.

గత ఏడాది పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది ఆర్టీసీ. సుధీర్ఘ లాక్‌డౌన్‌తో బస్సులు షెడ్లకే పరిమితం కావడంతో ఖజానా ఖాళీ అయింది. లాక్‌డౌన్‌ తర్వాత బస్సులు రోడ్డెక్కినప్పటికి సరైన ఆక్యుపెన్సీ రేషియో లేకపోవడంతో ఆర్టీసీకి ఆదాయం పూర్తిగా పడిపోయింది. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న డిజిల్ భారం ఆర్టీసీ పై తీవ్ర ప్రభవం చూపుతోంది. దీంతో ఆర్టీసీ ఉనికికే ప్రశ్నార్థకంగా ఏర్పడింది. దీంతో ఆర్టీసీ వినూత్నంగా ఆలోచించి ముందుకు వెళుతోంది. టికేటేతర ఆదాయం పెంచుకోవడానికి కార్గో సేవలు, పార్సిల్ సేవలు, కొరియర్ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా ప్రస్తుతం ప్రతి రోజు 18 లక్షల ఆదాయం సమకూరుతుంది. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాఆర్టీసీ గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమయంలో బడ్జెట్‌లో 3 వేల కోట్లు కేటాయించడం ఉద్యోగులకు ఊరట కలిగించింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ కాలం చెల్లిన బస్సులతో నడిపిస్తింది. ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించిన నిధులతో మరిన్ని కొత్త బస్సులు కొనడానికి అవకాశం కలగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories