Telangana BJP Chief: సంక్రాంతికి కొత్త దళపతి.. అధ్యక్షుడి రేసులో ఆ నలుగురు!

Telangana BJP Likely to Get New President by January
x

Telangana BJP Chief: సంక్రాంతికి కొత్త దళపతి.. అధ్యక్షుడి రేసులో ఆ నలుగురు!

Highlights

Telangana BJP Chief: తెలంగాణ బీజేపీకి కొత్త సారధి ఎప్పుడు రానున్నారు..? సంక్రాంతి తర్వాత ముహూర్తం ఖారారయ్యిందా..?

Telangana BJP Chief: తెలంగాణ బీజేపీకి కొత్త సారధి ఎప్పుడు రానున్నారు..? సంక్రాంతి తర్వాత ముహూర్తం ఖారారయ్యిందా..? పార్టీ కొత్త అధినేత ఎంపికపై ఎందుకు ఇంత సాగదీతా...? ఆ పార్టీలో జోరుగా చర్చ సాగడానికి కారణాలు ఏంటీ...? సామాజిక సమీకరణాలు కలిసి రావడం లేదా.. బాహుబలి వన్.. టూ పార్టులు ఉన్నాయా..? ఢిల్లీ పెద్దల మనసులో ఏవరూ ఉన్నారు...? కొత్త ఏడాదిలో కాషాయ పార్టీలో ఏమి జరుగుతోంది.?

తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షులు ఎవరు అనే అంశంపై హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నెల రెండోవారంలో కొత్త బాసును ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలే కాకుండా.. కేవలం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధ్యక్షుడి ఎంపిక జరుగుతున్నట్లు సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో జేపీ నడ్డా ఆధ్వర్యంలో సంఘటన్ సర్వ్ సమావేశం జరిగింది. దీనికి అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ఇన్ ఛార్జులు హాజరయ్యారు.

తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ పార్టీ బూత్, మండల స్థాయి కమిటీల భర్తీపై నివేదికను కిషన్‌రెడ్డి, నడ్డాకు అందజేశారు. తెలంగాణలో సుమారు 70 శాతం బూత్, మండల స్థాయి కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి అయినట్టు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల మొదటి వారంలో పదాధికారులు, జిల్లా అధ్యక్షుల పదవుల భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

పదాధికారులు, జిల్లా అధ్యక్షుల పదవుల భర్తీ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఏడాదిలోకి ఎంటర్ అవ్వడంతో ఇక ఈ నెల రెండో వారంలో రాష్ట్ర అధ్యక్షుడిపై ప్రకటన రానుందనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. కొత్త బాస్ ఎవరనే దానిపై పార్టీ నేతలలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొత్త అధ్యక్షుడి రేసులో ముఖ్యంగా నలుగురు నేతల పేర్లు మొదటి నుంచి బలంగా వినిపిస్తున్నాయి. వారంతా ఎంపీలే.

అందులో ప్రధానంగా ధర్మపురి అరవింద్, రఘునందన్‌రావు, ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఉన్నారు. వీరితో పాటు మరో రెండు పేర్లుకు తెరపై వచ్చాయి. అయితే అధ్యక్షుడి రేసులో ఎమ్మెల్యేలు ఎవరూ లేనట్టు తెలుస్తోంది. వీరంతా ఎవరికి వారే ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక అధిష్ఠాననికి కత్తి మీద సాముగా మారింది. ఈ నలుగురిలో ఎవరికైనా ఇస్తే పార్టీకి ఇబ్బందులు ఎమైనా వస్తాయా అనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. అలా కాకుండా కొత్త వ్యక్తిని తెరపైకి తెస్తారు అనే చర్చ కూడా పార్టీలో జరగుతుంది.

కొత్త ఏడాదిలో రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు రావడం ఖాయమని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుుతుంది. పని భారం కారణంగా కిషన్ రెడ్డి అధ్యక్ష రేసు నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పార్టీ అధక్షుడు ఎవరూ అనేది ఇప్పటికే అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని... ప్రకటించడమే తర్వాయి అని అంటున్నారు కమలం నేతలు. అయితే ఇక్కడే మరో ట్వీస్ట్ ఉంది. కేవలం మూడేళ్లకు మాత్రమే కొత్త అధ్యక్షుడు వస్తారని.. ఎన్నికల సమయంలో మరో కొత్త సారధి వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. బాహుబలి వన్, టూ ఉంటుందని అంటున్నారు. బాహుబలి పని తీరు ఆధారంగానే ఎన్నికల వరకు కొనగించాలా.. లేదా అనేది పార్టీ అధినాకత్వం నిర్ణయిస్తుందని అంటున్నరు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత పార్టీని ఉరుకులు పరుగులు పెట్టించే బాసు వస్తారని అంటున్నారు. మరి పార్టీ నేతలందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి పరుగులు పెట్టిస్తారా.. లేక ఆయననే పరుగెత్తుతారా అనేది వేసి చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories