తెలంగాణ బీజేపీలో అమిత్‌ షా టెన్షన్ ?

తెలంగాణ బీజేపీలో అమిత్‌ షా టెన్షన్ ?
x
Highlights

కశ్మీర్‌ ఇష్యూతో దేశం చూపు తనవైపు తిప్పుకున్నారు అమిత్‌ షా. ఇప్పుడు అదే అమిత్‌ షా తెలంగాణ బీజేపీ నేతలకు విధించిన డెడ్‌లైన్‌, ఇక్కడి లీడర్లకు టెన్షన్‌...

కశ్మీర్‌ ఇష్యూతో దేశం చూపు తనవైపు తిప్పుకున్నారు అమిత్‌ షా. ఇప్పుడు అదే అమిత్‌ షా తెలంగాణ బీజేపీ నేతలకు విధించిన డెడ్‌లైన్‌, ఇక్కడి లీడర్లకు టెన్షన్‌ పుట్టిస్తోంది. గడువు దగ్గరపడుతుండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు తెలంగాణ నేతలు. ఇంతకీ అమిత్‌ షా విధించిన డెడ్‌లైన్‌ ఏంటి దాని లక్ష్యమేంటి?

సభ్యత్వ నమోదు కార్యక్రమం తెలంగాణ బీజేపీ నేతల్లో గుబులు రేపుతోంది. కొత్తగా 18 లక్షల సభ్యత్వాలను నమోదు చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టార్గెట్ పెట్టడం, ఈ టెన్షన్‌కు కారణమయ్యింది. లక్ష్యం పెద్దదిగా ఉండటం, గడువు దగ్గర పడుతుండటంతో పార్టీ నాయకులు ఉరుకులు పరుగులు పెడ్తున్నారు. పార్టీ ఆఫీస్ వదిలి క్షేత్రస్థాయికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమాలతో బిజీబిజీ గా గడుపుతున్నారు. అయితే, పార్టీ బలోపేతం అయ్యేందుకు ముందు సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆదేశించారు. ముందు 12 లక్షల సభ్యత్వం లక్ష్యంగా పెట్టుకోగా అది సరిపోదని 18 లక్షలు చేయాల్సిందేనని టార్గెట్ పెట్టారు. అయితే గడువు దగ్గర పడుతుడటంతో పార్టీ నేతల్లో గుబులు మొదలయ్యింది.

మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ సభ్యత్వంపై జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే తెలంగాణలో ఆరులక్షల సభ్యత్వం పూర్తయింది. ఆన్‌లైన్‌లో మరో లక్షన్నరమంది సభ్యత్వం చేసుకున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే ఆగస్టు 11తో సభ్యత్వ నమోదు గడువు ముగియనుండడంతో ముఖ్యనాయకులంతా క్షేత్రస్థాయిలో ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

నాయకులు పార్టీ కార్యాలయం వదిలి ఇంటింటికీ తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్నారు. సభ్యత్వ నమోదుపై ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆరా తీస్తుండటం నగర పర్యటనకు వచ్చే అవకాశాలు ఉండటం నాయకుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. ఎలాగైనా అధ్యక్షుడు పెట్టిన లక్ష్యా న్ని చేరుకుకోవాలని, లేదంటే అధ్యక్షుడి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందన్న టెన్షన్ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా జరిగిన భారతీయ జనతాపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదటి రోజు తెలంగాణలో పర్యటించిన అమిత్ షా, ఇప్పుడు ఏకంగా ఇక్కడ క్రియాశీల సభ్యత్వం తీసుకోబోతున్నారని తెలిసింది.

గుజరాత్‌లో అమిత్ షాకు సాధారణ సభ్యత్వం ఉండగా, తెలంగాణ నుంచి పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సభ్యత్వం రావాలంటే ముందు 50 మందిని పార్టీలో చేర్పించాల్సి ఉంటుంది. దీనికోసం అమిత్‌షా ఈనెల 16 లేదా 17వ తేదీన రాష్ట్ర పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీకి 18 లక్షల సభ్యత్వం ఉండగా, మరో 12 లక్షలమందిని చేర్పించి దాన్ని 30 లక్షలకు తీసుకెళ్లాలని ముందు రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. కానీ ఇక్కడ బీజేపీ బలపడేందుకు ఈ లక్ష్యం సరిపోదని, కొత్త సభ్యత్వాలు 18 లక్షలు చేయించాలని అమిత్‌ షా రాష్ట్ర పార్టీకి ఆదేశాలు జారీచేశారు.

ఇంతవరకూ తెలంగాణలో బాగానే సభ్యత్వాలు నమోదైనా, ఎక్కువగా ఉత్తర తెలంగాణలోనే అయ్యాయని, మిగతా ప్రాంతాల్లో పెద్డగా నమోదు కాలేదని సమాచారం. దీంతో మిగతా జిల్లాల్లోనూ భారీగా సభ్యత్వాలను నమోదు చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇందుకోసం ఏడు వేల మంది పార్టీ విస్తారక్‌లను రంగంలోకి దించుతోంది.

మొత్తం మీద సభ్యత్వాల టార్గెట్, ఇటు క్రియాశీలక సభ్యత్వం కోసం అమిత్‌ షా స్వయంగా తెలంగాణలో మరోసారి పర్యటించనుండటంతో, బీజేపీ తెలంగాణకు ఎంతగా ప్రాధాన్యతనిస్తుందో అర్థమవుతోంది. అందుకే మెంబర్‌షిప్‌ డ్రైవ్‌ బీజేపీ రాష్ట్ర నాయకుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. అయితే మున్సిపల్ ఎన్నికలకు ముందు ఈ పరిణామాలన్నీ పార్టీకి కలిసి వస్తాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories