Telangana Assembly sessions: డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly sessions: డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
x
Highlights

Telangana Assembly Winter sessions 2024 Dates: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు శాసన...

Telangana Assembly Winter sessions 2024 Dates: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు మొదలుకానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ విడుదల చేశారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారనేది ఈ నెల 9న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్న నేపథ్యంలో.. అసెంబ్లీ సమావేశాలు మరింత రసవత్తరంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ఏడాది పాలన, రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళన, రైతు భరోసా వంటి అంశాలపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది.

ప్రతిపక్షం ఫోకస్ చేస్తోన్న అంశాలు

మరోవైపు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కేసులు, లగచర్ల ఘటన, రైతు భరోసా, సన్న ఒడ్లకు బోనస్ వంటి అంశాలపై చర్చకు పట్టుపట్టే అవకాశం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories