TS Assembly: తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్, మాజీ మంత్రి హరీష్‌రావుల మధ్య మాటల యుద్ధం

Telangana Assembly updates Live
x

TS Assembly: తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్, మాజీ మంత్రి హరీష్‌రావుల మధ్య మాటల యుద్ధం

Highlights

TS Assembly: ఇరిగేషన్‌పై చర్చ సందర్భంగా ఇరువురు నేతల విమర్శలు

TS Assembly: తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్, మాజీ మంత్రి హరీష్‌రావులు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఇరిగేషన్‌పై చర్చ సందర్భంగా ఇరువురు నేతలు కౌంటర్లు విసురుకున్నారు. పుట్టు కాంగ్రెస్ వాది అయిన ఉత్తమ్ ఆరేడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. సీఎం కాలేదనే ప్రస్టేషన్‌లో ఉన్నారని హరీష్‌రావు విమర్శించారు. దీంతో హరీష్‌రావు వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు ఉత్తమ్. కేసీఆర్‌ను దింపి సీఎం పీఠంపై హరీష్‌రావు కూర్చునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బావ కేటీఆర్‌తో పంచాయితీ ఉందని అన్నారు. కాంగ్రెస్‌లో తామంతా కలిసి ఉన్నామని రిప్లయ్ ఇచ్చారు ఉత్తమ్.

Show Full Article
Print Article
Next Story
More Stories