పార్లమెంట్ గైడ్ లైన్స్ ప్రకారమే అసెంబ్లీ సమావేశాలు: మంత్రి వేముల

పార్లమెంట్ గైడ్ లైన్స్ ప్రకారమే అసెంబ్లీ సమావేశాలు: మంత్రి వేముల
x
Highlights

vemula prashanth reddy: క‌రోనా వైర‌స్ వ్యాప్తి దృష్ట్యా శాస‌న‌స‌భ‌లో కొత్త‌గా 40 సీట్లు, మండ‌లిలో కొత్త‌గా 8 సీట్ల‌ను ఏర్పాటు చేశామ‌ని...

vemula prashanth reddy: క‌రోనా వైర‌స్ వ్యాప్తి దృష్ట్యా శాస‌న‌స‌భ‌లో కొత్త‌గా 40 సీట్లు, మండ‌లిలో కొత్త‌గా 8 సీట్ల‌ను ఏర్పాటు చేశామ‌ని శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సన్నద్ధంగా ఉందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. సభ్యులకు రావాల్సిన సమాధానాలు వచ్చే ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్ల‌మెంట్ ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాలు పాటిస్తూ అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హిస్తామ‌న్నారు. శాస‌న‌స‌భ‌, మండ‌లి హాల్‌లో ఆరు అడుగుల దూరం ఉండేలా సీట్ల ఏర్పాటు చేశామ‌ని చెప్పారు.

మార్ష‌ల్స్ రెండు రోజుల ముందే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. అసెంబ్లీకి వ‌చ్చే అధికారులు, ఇత‌ర సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. శాఖల వారిగా అవసరం ఉన్న అధికారులు మాత్రమే వచ్చే విదంగా చర్యలు తీసుకోవాలన్నారు. పీపీఈ కిట్లు ర్యాపిడ్ కిట్లు ఆక్సిమిటర్లు, అంబులెన్స్ లు అసెంబ్లీ లో రెండు, శాసనమండలిలో మరో రెండు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అసెంబ్లీ సెక్రెటరీ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు కూడా కరోనా టెస్టులు చేయిస్తామన్నారు. అలాగే జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ , అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ప్రతి రోజు శానిటేషన్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అసెంబ్లీలో రెగ్యులర్ ఉండే వైద్యులతో పాటు కరోనా పై అవగాహన ఉన్న వైద్యులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. శాసనసభ లోకి మంత్రులు, వారి పీఏలు అలాగే ఎమ్మెల్యేలు వారి పీఏలకు మాత్రమే అనుమతిస్తామన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories