ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు అసెంబ్లీ స‌మావేశాలు

ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు అసెంబ్లీ స‌మావేశాలు
x
Highlights

తెలంగాణ ‌శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత‌న భేటీ అయిన బిజినెస్ అడ్వైజ‌రీ క‌మిటీ (బీఏసీ) స‌మావేశ‌ం ముగిసింది. స్పీక‌ర్...

తెలంగాణ ‌శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత‌న భేటీ అయిన బిజినెస్ అడ్వైజ‌రీ క‌మిటీ (బీఏసీ) స‌మావేశ‌ం ముగిసింది. స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశానికి సీఎం కేసీఆర్, శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు అక్బ‌రుద్దీన్ ఓవైసీ, భ‌ట్టి విక్ర‌మార్క‌, అసెంబ్లీ సెక్ర‌ట‌రీ న‌రసింహాచార్యులు హాజ‌ర‌య్యారు. ఈనెల 28 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

సభ నిర్వహణ, అజెండా తయారీపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ స‌మావేశాలు మొత్తం 18 రోజుల పాటు కొన‌సాగ‌నున్నాయి. 12, 13, 20, 27వ తేదీల్లో అసెంబ్లీకి సెల‌వులు ప్ర‌క‌టించారు. శాస‌న‌స‌భ‌లో గంట పాటు ప్ర‌శ్నోత్త‌రాల‌కు కేటాయించారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో 6 ప్ర‌శ్న‌ల‌కు మాత్ర‌మే అనుమ‌తిచ్చారు. అర గంట పాటు జీరో అవ‌ర్ కొన‌సాగ‌నుంది. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలపై రేపు సభలో చర్చ చేపట్టి పలు తీర్మానాలు చేయనున్నారు. ఈనెల 10, 11 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త రెవెన్యూ చట్టం బిల్లుపై చర్చ చేపట్టనున్నారు. అనంతరం ఆ బిల్లుకు శాసనసభ ఆమోదముద్ర వేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories